సాబ్జీ, సత్యనారాయణ మృతి తీరనిలోటు

ప్రజాశక్తి – భీమవరం

ఉపాధ్యాయ ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ, యుటిఎఫ్‌ సీనియర్‌ నేత పెన్మెత్స సత్యనారాయణరాజు అకాల మరణం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు తీరని లోటని పెన్షనర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు ఎన్‌ఎస్‌ఎస్‌.పాల్‌ అన్నారు. స్థానిక సంఘం కార్యాలయంలో సాబ్జీ, సత్యనారాయణరాజు సంస్మరణ సభ గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. యుజిసి పెన్షనర్స్‌ అధ్యక్షులు సత్యనారాయణ రాజు మాట్లాడుతూ సాబ్జీ, సత్యనారాయణరాజు ఎప్పుడూ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల శ్రేయస్సు కోసం పరితపించేవారన్నారు. పెన్షనర్స్‌ అసోసియేషన్‌ భీమవరం యూనిట్‌ కార్యదర్శి సీతారామరాజు మాట్లాడుతూ షేక్‌ సాబ్జీ ఉద్యోగ, ఉపాధ్యాయ, సమస్యలు పరిష్కరించడమే కాకుండా ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారన్నారు. ఎస్‌టిఒ రవివర్మ మాట్లాడుతూ సత్యనారాయణ రాజు ఆకస్మిక మరణం తీరనిలోటన్నారు. పెన్షనర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు జి.జేమ్స్‌ మాట్లాడారు. సభలో పెన్షనర్స్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి సాగిరాజు సత్యనారాయణరాజు, కోశాధికారి రవిప్రసాద్‌, యుటిఎఫ్‌ సీనియర్‌ నాయకులు అలుగు ఇశ్రాయేల్‌ రాజు, భీమవరం యూనిట్‌ కోశాధికారి సూర్యనారాయణ, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ భాస్కరరావు, అప్పన సత్యనారాయణ, యుజిసి పెన్షనర్స్‌ కార్యదర్శి సుబ్బారావు, పాండు రంగరాజు, గాయకులు చైతన్యప్రసాద్‌, చాన్‌ భాషా, మంతెన వెంకటరాజు, కెసిఆర్‌ రామలింగరాజు పాల్గొన్నారు.

➡️