ఇంటిగ్రేడ్‌ కమాండ్‌ సెంటర్‌ పరిశీలన

ప్రజాశక్తి – భీమవరం

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాకు నియమించిన వ్యయ పరిశీలకులు గురువారం కలెక్టరేట్‌లోని జిల్లా ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ సెంటర్‌ను పరిశీలించారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి పర్యవేక్షణ నిమిత్తం గురువారం ఉదయం జిల్లాకు చేరుకున్న వ్యయ పరిశీలకులు పియూష్‌ శుక్ల, మోహన్‌ అగర్వాల్‌, విక్రమాదిత్య మీన కలెక్టరేట్‌ జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జిల్లా కలెక్టరేట్‌లోని జిల్లా ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ సెంటర్‌లోని అన్ని విభాగాలనూ వారు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ ఎన్నికల వ్యయ పరిశీలకులకు ఎంసిసి, ఎంసిఎంసి, ఎలక్ట్రానిక్‌ మీడియా మానిటరింగ్‌ సెల్‌, ఎక్స్పెండిచర్‌ మానిటరింగ్‌ సెల్‌, సీజర్స్‌, సువిధ తదితర విభాగాల సిబ్బంది నిర్వర్తిస్తున్న విధులు గురించి పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా పరిశీలకులకు వివరించారు. కంట్రోల్‌ రూమ్‌ సేవలపై ఎన్నికల వ్యయ పరిశీలకులు సంతృప్తి వ్యక్తం చేశారు. పరిశీలించిన వారిలో జెసి సివి.ప్రవీణ్‌ ఆదిత్య, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్‌ పిడి కానాల సంగీత్‌మాధుర్‌, అధికారులు పాల్గొన్నారు. ఏలూరు: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాకు నియమించిన వ్యయ పరిశీలకులు గురువారం ఏలూరు కలెక్టరేట్‌లోని జిల్లా ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ సెంటర్‌ను పరిశీలించారు. గురువారం జిల్లాకు చేరుకున్న ఎన్నికల వ్యయ పరిశీలకులు పి.కీర్తినారాయణ్‌, షెరింగ్‌ జోర్డన్‌ భూటియా, మేశ్రామ్‌ గౌరవ్‌ మధుకర్‌ కలెక్టరేట్‌లోని జిల్లా ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ సెంటర్‌ను పరిశీలించారు. కంట్రోల్‌ రూమ్‌లోని అన్ని విభాగాలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా మానిటరింగ్‌ సెల్‌, సి-విజిల్‌, సోషల్‌ మీడియా, కాల్‌సెంటర్‌, ఎఫ్‌ఎస్‌టి, ఎస్‌ఎస్‌టి వాహనాల జిపిఎస్‌ ట్రాకింగ్‌ విధానం, ఎక్సపెండీచర్‌ మానిటరింగ్‌ సెల్‌, సీజర్స్‌, సువిధ, గ్రీవిన్స్‌, రిడ్రెసల్‌ సెల్‌ మొదలైన విభాగాల సిబ్బంది నిర్వర్తిస్తున్న విధుల గురించి పరిశీలకులకు వివరించారు. కంట్రోల్‌ రూమ్‌ సేవలపై ఎన్నికల వ్యయ పరిశీలకులు సంతృప్తి వ్యక్తం చేశారు. వీరి వెంట డిఆర్‌ఒ డి.పుష్పమణి, కలెక్టరేట్‌ ఎఒ కె.కాశీవిశ్వేశ్వరరావు, సంబంధిత ఎన్నికల నోడల్‌ అధికారులు, కంట్రోల్‌ రూమ్‌ సిబ్బంది ఉన్నారు.పరిశీలకులకు స్వాగతం పలికిన కలెక్టర్‌ ఎన్నికల వ్యయ పరిశీలకులు గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్‌కు చేరుకున్నారు. వీరికి జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ పూలమొక్కలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఛాంబర్‌లో జిల్లా ఎన్నికల అధికారితో పరిశీలకులు పి.కీర్తి నారాయణ్‌, షెరింగ్‌ జోర్డన్‌ భూటియా, మేశ్రామ్‌ గౌరవ్‌ మధుకర్‌ సమావేశమై పలు అంశాలపై చర్చించారు.

➡️