ఎస్‌ఆర్‌కెఆర్‌ ప్రొఫెసర్‌కు డాక్టరేట్‌

ప్రజాశక్తి – భీమవరం రూరల్‌
ఎస్‌ఆర్‌కెఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల కంప్యూటర్‌ సైన్స్‌, ఇంజినీరింగ్‌ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ వివి.శివరామరాజు బీజు పట్నాయక్‌ యూనివర్సిటీ, రూర్కెలా, ఒడిశా నుంచి పిహెచ్‌డి పొందారని ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కెవి.మురళీకృష్ణమరాజు తెలిపారు. క్రికెట్‌లో విన్నర్‌ ప్రెడిక్షన్‌ లైవ్‌ స్కోర్‌ అంచనా ప్లేయర్‌ సెలక్షన్‌ అంశాలపై మిషన్‌ లెర్నింగ్‌ అల్గారిథమ్స్‌ టెక్నాలజీతో చేసిన పరిశోధనకు ఈ డాక్టరేట్‌ అందుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా యాజమాన్యం తరపున డాక్టర్‌ వివి.శివరామరాజును కళాశాల సెక్రటరీ సాగి రామకృష్ణ నిశాంత్‌ వర్మ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ శివరామరాజు మాట్లాడారు. శివరామరాజును కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ హెడ్‌ డాక్టర్‌ వి.చంద్రశేఖర్‌, సహచార ప్రొఫెసర్స్‌ అభినందించారు.

➡️