నేటి నుంచి డ్రెయినేజీల్లో పూడికతీత పనులు

ప్రజాశక్తి – నరసాపురం

నేటి నుంచి పురపాలకంలో డ్రెయినేజిల్లో పూడికతీత పనులు ప్రారంభమవుతాయని చైర్‌పర్సన్‌ బర్రి వెంకటరమణ తెలిపారు. సోమవారం పురపాలక కార్యాలయంలో కౌన్సిల్‌ హాల్లో ఛైర్‌పర్సన్‌ బర్రె వెంకటరమణ అధ్యక్షతన కౌన్సిల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వెంకటరమణ మాట్లాడుతూ రానున్న వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని పట్టణంలోని డ్రెయినేజీల్లో పూడికతీత పనులు చేపడుతున్నామన్నారు. వార్డు కౌన్సిలర్లు పనులు పర్యవేక్షించాలన్నారు. కమిషనర్‌ కె.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అధికారులతో ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడతామన్నారు. కౌన్సిలర్లు కోటిపల్లి సురేష్‌, కేసరి గంగరాజు, బొమ్మిడి సూర్యకుమారి, పతివాడ పద్మ మాట్లాడుతూ వార్డుల్లో శానిటేషన్‌ సక్రమంగా జరగట్లేదని, ఫలితంగా దోమలు పెరిగిపోయి ప్రజల ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. తోట అరుణ మాట్లాడుతూ తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరారు.

➡️