తక్కువ ఫీజులతో కార్పొరేట్‌ విద్య ‘జ్ఞానానంద’ సొంతం

ప్రజాశక్తి – కాళ్ల

తక్కువ ఫీజులతో కార్పొరేట్‌ స్థాయి విద్యనందించడమే తమ పాఠశాల లక్ష్యమని జ్ఞానానంద ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ అకడమిక్‌ డైరెక్టర్‌ దాట్ల విజయకుమారి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ప్రజాశక్తితో మాట్లాడారు. అందరికీ నాణ్యమైన విద్యనందించడానికి మాజీ సర్పంచి దాట్ల చిన్న రామచంద్రరాజు 1989లో ఏలూరుపాడు గ్రామంలో జ్ఞానానంద పబ్లిక్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీని స్థాపించారని, ప్రయిమరీ విద్యతో సంస్థను ప్రారంభించారని తెలిపారు. ప్రైమరీ విద్యతో ఆరంభించి అంచలంచెలుగా హై స్కూల్‌ స్టాయికి ఎదిగిందన్నారు. దాట్ల విజయకుమారి సారథ్యంలో జిల్లాలోని సమీప గ్రామాలు, కృష్ణా జిల్లా నుంచి విద్యార్థులను ఆకర్షించి నంబర్‌ వన్‌ పాఠశాలగా అభివృద్ధి చెందిందన్నారు. విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించేందుకు అతి పెద్ద ఆటస్థలం, సమీప గ్రామాల నుంచి విద్యార్థులను పాఠశాలకు చేర్చేందుకు బస్సు సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. అంతేగాక క్రీడలు, సంగీతం, డాన్స్‌, భగవద్గీత, కరాటేలో శిక్షణ ఇస్తున్నామన్నారు. పదో తరగతి విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని సాయంత్ర వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. హైస్కూల్‌ ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకూ ప్రతి సంవత్సరమూ 10వ తరగతి విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారన్నారు. మండల స్థాయిలో మొదటి, రెండో స్థానం సాధిస్తున్నారన్నారు. ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో జ్ఞానానంద విద్యార్థులు విజయదుందుభి మోగించారని తెలిపారు. మండలంలో 570 మార్కులతో ప్రథమ స్థానం కట్టా మణి విఘ్నేేష్‌, 564 మార్కులతో ద్వితీయ స్థానం అంకాల రమ్య జ్యోతి, పొన్నాడ కావ్యాంజలి, 556 మార్కులతో తతీయ స్థానం దాట్ల హర్ష శ్రీవెంకట రామరాజు సాధించారన్నారు. మొత్తం 47 మంది విద్యార్థులకు గాను 42 మంది ప్రథమ శ్రేణిలో, ముగ్గురు ద్వితీయ శ్రేణిలో, ఇద్దరు తతీయ శ్రేణిలో విజయం సాధించారని, వారి విజయానికి జ్ఞానానంద విద్యా సంస్థల సెక్రటరీ కరస్పాండెంట్‌ డిజెఎస్‌ఆర్‌.శ్రీనివాసవర్మ, ప్రధానోపాధ్యాయులు ఎం.త్రిమూర్తిరాజు, ఉపాధ్యాయులు కృషి ఎంతో ఉందన్నారు. 500 మార్కులపైగా సాధించిన విద్యార్థులు 11 మంది, 400 మార్కులు పైగా సాధించిన విద్యార్థులు 22 మంది ఉన్నారన్నారు.జూనియర్‌ కళాశాల..ఈ ప్రాంతంలో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు దూర ప్రాంతాలకెళ్లి చదువుకోవడానికి కష్టంగా ఉన్న నేపథ్యంలో 2007-08లో దాట్ల చిన్న రామచంద్రరాజు జూనియర్‌ కళాశాలను స్థాపించి పేద విద్యార్థులకు అతి తక్కువ ఫీజులతో కార్పొరేట్‌ విద్యనందిస్తున్నామన్నారు. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ విద్యార్థులకు ప్రయోగశాలలు (లాబ్స్‌) ఉన్నాయని తెలిపారు. కళాశాల వద్ద ప్రయోగ పరీక్షలు జరుగుతున్నాయన్నారు. కళాశాలలో ఏటా 80 శాతానికి పైగా విద్యార్థులు ఉత్తీర్ణులవుతున్నారని తెలిపారు. ఎంపిసి, బైపిసి, విద్యార్థులకు ఇఎపి సెట్‌ కోచింగ్‌ ఇస్తున్నామన్నారు. గత సంవత్సరం ఈ కళాశాల విద్యార్థినులు ఎస్‌ఆర్‌కెఆర్‌ ఇంజినీరింగ్‌, విష్ణు ఇంజినీరింగ్‌ కాలేజీల్లో సీట్లు సాధించారన్నారు. విద్యార్థులకు విలువలతో కూడిన విద్యనందిస్తున్నామన్నారు.

➡️