భీమవరం అభివృద్ధికి ఐక్యంగా పనిచేద్దాం

కేంద్ర సహాయ మంత్రిని సత్కరించిన ఎంఎల్‌ఎ అంజిబాబు

ప్రజాశక్తి – భీమవరం టౌన్‌

భీమవరం అభివృద్ధికి ఇద్దరం కలిసి పాటుపడతామని భీమవరం ఎంఎల్‌ఎ పులపర్తి రామాంజనేయులు(అంజిబాబు) అన్నారు. నరసాపురం బిజెపి ఎంపీ, కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ నివాసంలో అంజిబాబు మర్యాదపూర్వకంగా సోమవారం కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చాన్ని అందించి సత్కరించారు. ఇద్దరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. జిల్లా కేంద్రమైన భీమవరం అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై, అనుసరించాల్సిన వ్యూహాలపై కొద్ది సమయం చర్చించారు.

➡️