వైసిపితోనే లంక గ్రామాల అభివృద్ధి : చెరుకువాడ

ప్రజాశక్తి – ఆచంట

లంక గ్రామాల్లో తాగునీరు, విద్య, వైద్యం, రవాణా సౌకర్యాలు లేక ప్రజలు అవస్థలు పడే వారిని వైసిపి ప్రభుత్వంలో లంక గ్రామాలను అభివృద్ధి చేసి తీర్చిదిద్దామని వైసిపి ఆచంట ఎంఎల్‌ఎ అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. గురువారం అయోధ్యలంక గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లంకగ్రామాల్లో కులమత, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించామన్నారు. జగన్మోహన్‌రెడ్డి ప్రకటించిన సంక్షేమ పథకాలు పేదల అభివృద్ధికి ఎంతో తోడ్పడుతాయన్నారు. ఉమ్మడి దోపిడీ కోసం టిడిపి బిజెపి జనసేన కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో రెండు ఓట్లు ఫ్యాను గుర్తుకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కడలి వెంకట్‌ రెడ్డి, గొల్లపల్లి బాలకృష్ణ, సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, సతీష్‌, మహిళలు పాల్గొన్నారు.

➡️