విద్యార్థుల సమాగ్రాభివృద్ధే ధ్యేయంగా సంసిద్ధ్‌ పాఠశాలలు

ఛైర్మన్‌ వాసా శ్రీనివాసరావు

ప్రజాశక్తి – నరసాపురం

విద్యార్థుల సమగ్రాభివృద్ధే ధ్యేయంగా సుమారు దేశంలో 22 బ్రాంచిలకుపైగా సంసిద్ధ్‌ పాఠశాలలను నెలకొల్పడం జరిగిందని సంసిద్ధ్‌ గ్రూప్‌ ఆఫ్‌ స్కూల్స్‌ ఛైర్మన్‌ వాసా శ్రీనివాసరావు అన్నారు. స్థానిక పాలకొల్లు రోడ్డులోని సంసిధ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ విద్యార్థులు సిబిఎస్‌ఇ ఫలితాల్లో నూటికి నూరు శాతం సాధించిన సందర్భంగా సంసిద్ధ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌ మెట్ల సురేష్‌ ఆధ్వర్యంలో సోమవారం అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సంసిద్ధ్‌ గ్రూప్‌ ఆఫ్‌ స్కూల్స్‌ ఛైర్మన్‌ వాసా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ విజయానికి సహకరించిన తల్లితండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేశారు. సిఇఒ ఇందుసనో మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌తో కూడిన బోధనా పద్ధతులను ప్రవేశ పెట్టడం చాలా గొప్ప విషయం అని, ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థి వినియోగించుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు.

➡️