పెన్సిల్‌పై ఎస్‌ఆర్‌హెచ్‌ ఆర్ట్‌

ప్రజాశక్తి – నరసాపురం

చెన్నైలో జరుగుతున్న ఐపిఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో కెకెఆర్‌, ఎస్‌ఆర్‌హెచ్‌ తలబడుతుంది. ఈ మ్యాచ్‌లో తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌కు చెందిన సన్‌రైజర్స్‌ గెలవాలని కోరుకుంటూ నరసాపురం పట్టణంకు చెందిన మైక్రో ఆర్టిస్ట్‌ కొప్పినీడి విజరు పెన్సిల్‌ ముక్కుపై ఇంగ్లీషులో ఎస్‌ఆర్‌హెచ్‌ అని చెక్కి అభిమానాన్ని చాటుకున్నారు. విజరు వృత్తిరీత్యా మండలంలోని లిఖితపూడి సచివాలయంలో సర్వేయర్‌గా పనిచేస్తూ తన ప్రతిభను కనబరిచాడు.

➡️