రేపు సత్తిరాజు సంస్మరణ సభ

ప్రజాశక్తి – పాలకొల్లు

సత్తిరాజు సంస్మరణ సభ ఈనెల 19వ తేదీన ఆయన స్వగ్రామం పాలకొల్లు మండలం అరట్లకట్టలో జరుగుతుందని సిపిఎం మండల కార్యదర్శి జవ్వాది శ్రీనివాసరావు తెలిపారు. సత్తిరాజు తుదిశ్వాస విడిచే వరకు నిస్వార్థంగా, క్రమశిక్షణతో పార్టీ నిర్ణయాల అమలుకు పనిచేశారని, గ్రామంలో పేదలు, వ్యవసాయ కార్మికుల సమస్యలపై పనిచేశారని తెలిపారు. సిపిఎం నాయకులుగా, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులుగా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకోవడానికి ఈ సభ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ సంస్మరణ సభలో సభ్యులు, సానుభూతి పరులు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ సభలో సిపిఎం రాష్ట్ర సెక్రటేరియట్‌ సభ్యులు మంతెన సీతారాం, జిల్లా కార్యదర్శి బి.బలరాం, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పాల్గొంటారని తెలిపారు.

➡️