సిసిఎం అభ్యర్థులను గెలిపించండి

Apr 13,2024 21:29

 ప్రజాశక్తి – కొమరాడ : నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతూ సిపిఎం తరపున పోటీ చేసే ఎంపి, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం నాయకులు కొల్లి సాంబమూర్తి పిలుపునిచ్చారు. మండలంలోని కూనేరు సంతలో శనివారం ఎర్రజెండా తరుపున పోటీ చేసిన ఎమ్మెల్యే మండంగి రమణ, ఎంపి పి.అప్పలనర్స అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని సంతలో ప్రసారం చేశారు. సిపిఎం తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఎం.రమణ, ఈనెల 23న కురుపాంలో నామినేషన్‌ వేస్తున్న సందర్భంగా గిరిజనులంతా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. గిరిజన గ్రామాల్లో ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యల పైన ఎల్లవేళల ప్రభుత్వ విధానాలపై పోరాడుతున్న మండంగి రమణ, పాచిపెంట అప్పల నర్స పోటీ చేస్తున్నారని, వీరిద్దరిని అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు, గిరిజనులు పాల్గొన్నారు.

➡️