నీటి కోసం రోడ్డెక్కిన మహిళలు

ప్రజాశక్తి-పెద్దదోర్నాల: పెద్దదోర్నాల మండలంలోని బోడేనాయక్‌ తండా గిరిజనులు ఐనముక్కల గ్రామంలోని దూదేకుల కాలనీ, బీసీ కాలనీలకు చెందిన ప్రజలు సోమవారం నీటి ఇబ్బందులు తీర్చాలంటూ ఖాళీ బిందెలతో ధర్నాలు నిర్వహించారు. నీటి సౌకర్యం లేని కారణంగా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని వాపోయారు. నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ అధికారులకు తెలిపినా పట్టించుకోలేదని వాపోయారు. బోడేనాయక్‌ తండాలో నీటి సౌకర్యం ఉన్నా ఒక వర్గం వారు ప్రజలకు నీరు అందించడం లేదని ఆరోపించారు. నీటి సమస్యను పరిష్కరించే వరకు ఆందోళనను కొనసాగిస్తామని తెలిపారు. దీంతో ఎంపిడివో నాసర్‌రెడ్డి ఆందోళన చేస్తున్న ప్రజల దగ్గరకు వెళ్లి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో నిరసనను విరమించారు. నిరసనకారులు ప్రధాన రహదారులపై ఆందోళన చేపట్టడంతో రహదారికి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి.

➡️