కోనాడలో వైసిపి ఎన్నికల ప్రచారం

Apr 4,2024 21:32

 ప్రజాశక్తి – పూసపాటిరేగ : మరోసారి వైసిపి ప్రభుత్వాన్ని గెలిపించాలని నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్‌బాబు, జిల్లా వైసిపి కోశాధికారి కందుల రఘుబాబు కోరారు. గురువారం మండలంలోని కోనాడ, బొడ్డుగురయ్యపేట గ్రామాల్లో తొమ్మిదో రోజు వైసిపి ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ సందర్బంగా వారు ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాలు అందించే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మొహన్‌రెడ్డిని గెలిపించుకోవాలంటే ఎమ్మెల్యేగా తనను, ఎంపిగా బెల్లానను గెలిపించుకోవాలని కోరారు. ప్రచారంలో వైసిపి మండల అధ్యక్షలు పతివాడ అప్పలనాయుడు, వైస్‌ ఎంపిపిలు అల్లాడ రమేష్‌, ఎన్‌. సత్యనారాయణరాజు, జెసిఎస్‌ కన్వినర్‌ మహంతి శ్రీనువాసరావు, రామతీర్ధం ఆలయం బోర్డు సభ్యులు దాడిశెట్టి త్రినాదరావు, మాజీ సర్పంచి దాడిశెట్టి గోవిందరావు, ఎంపిటిసి అప్పలనర్పమ్మ, లక్ష్మణరెడ్డి, బొడ్డు యల్లాజీ, నాయకులు మహంతి జనార్దనరావు, పుప్పాల లక్ష్మినారాయణ, దేశెట్టి గణేష్‌, పట్టెపు శ్రీనివాసరావు, యడ్ల రామకృష్ణ, రౌతు శ్రీరామూర్తి తదితరులు పాల్గొన్నారు.

➡️