అభివృద్ధి చేయడంలో వైసిపి విఫలం

Apr 13,2024 21:27

ప్రజాశక్తి-బొబ్బిలి: నియోజకవర్గ అభివృద్ధిలో వైసిపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీమంత్రి సుజరుకృష్ణ రంగారావు, మాజీ ఎమ్మెల్యే తెంటు రాజా తెలిపారు. పట్టణంలోని తారకరామ కాలనీలో శనివారం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బేబినాయనతో కలిసి శనివారం వారు ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల పక్షాన పని చేసే బేబినాయనను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి పని చేస్తారన్నారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారం చేసిన నాయకులకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ప్రచారంలో జనసేన నాయకులు గిరడ అప్పలస్వామి, బాబు పాలూరి, నాయకులు పాల్గొన్నారు.

➡️