ఈ ఏడాదిలో ఓటీటీలో అలరించినవి ఎన్ని సినిమాలంటే?

Dec 21,2023 12:13 #movie, #OTT

ఈ ఏడాది (2023) పొడవునా భారీ బడ్జెట్‌ సినిమాలు, చిన్న సినిమాలు కూడా ప్రేక్షకుల్ని అలరించాయి. ఈ ఏడాదిలో ‘బేబీ’ సినిమా యూత్‌ని బాగా ఆకట్టుకుంది. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ హిట్‌ కొట్టింది. అలాగే ఓటీటీ ఆహా వేదికగా విడుదలై నెటిజన్లను ఆకట్టుకుంది. ఇక ఈ సంవత్సరంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన ‘జైలర్‌’ మూవీ, ప్రకాశ్‌రాజ్‌, బ్రహ్మానందం స్నేహితులుగా నటించిన ‘రంగమార్తాండ’ సినిమాలు సామాజిక స్పృహను కలిగించాయి. ఈ సినిమాలు ఓటీటీలో కూడా విశేషంగా ఆకట్టుకున్నాయి. సినిమాలు ఒకెత్తయితే.. వెబ్‌ సిరీస్‌లు, షోలు మరొకెత్తుగా ఈ ఏడాది అలరించాయి. ఇందులో ముందువరుసలో చెప్పుకునేది నటుడు బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించిన ‘అన్‌స్టాపబుల్‌’. ఇది ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఉర్రూతలూగించింది. ఈ షోతోనే బాలకృష్ణలోని మరో యాంగిల్‌ కనిపించింది. హీరోయిన్‌ నిత్యామీనన్‌ తొలిసారి నటించిన వెబ్‌సిరీస్‌ ‘కుమారి శ్రీమతి’. ఒంటరి మహిళ పడే కష్టాలనే ఇతివృత్తంగా తీసిన ఈ సిరీస్‌ బాగా ఆకట్టుకుంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు పాన్‌ ఇండియా సినిమాల నుంచి డబ్బింగ్‌ సినిమాల వరకు మొత్తం దాదాపు 220 సినిమాలు విడుదలయ్యాయి. వీటిల్లో చాలా సినిమాలు వెండితెరపైనే కాదు.. ఓటీటీలోనూ అలరించాయి.

2023 ఉత్తమ చిత్రాలు

ఈ ఏడాదిలో ‘హారు నాన్న’, ‘రంగమార్తాండ’, ‘వారసుడు’, ‘కీడా కోలా’, ‘టైగర్‌ నాగేశ్వరరావు’, ‘భగవంత్‌ కేసరి’, ‘ఖుషి’, ‘బెదురులంక’, ‘బేబీ’, ‘సామజవరగమన’, ‘విమానం’, ‘కస్టడీ’, ‘ఉగ్రం’, ‘విరూపాక్ష’, ‘శాకుంతలం’, ‘దసరా’, ‘ఫలానా అబ్బాయి..ఫలానా అమ్మాయి’, ‘బలగం’, ‘కోనసీమ థగ్స్‌’, ‘వినరో భాగ్యము విష్ణు కథ విడుదలైన ఈ చిత్రాలన్నీ ఉత్తమ చిత్రాలుగా నిలిచాయి. వెండితెరపై హిట్‌ టాక్‌ అందుకున్న చిత్రాలు ఓటీటీ వేదికగా ఏయే తేదీల్లో విడుదలయ్యాయంటే..

జనవరి

జనవరి 1 మట్టి కుస్తీ : విష్ణు విశాల్‌, ఐశ్వర్య లక్ష్మీ కలిసి నటించిన చిత్రం ‘మట్టి కుస్తీ’ 1.1.2023 నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.

లారీ : విశాల్‌ నటించిన లాఠీ మూవీ జనవరి14వ తేదీన సన్‌ ఎన్‌ఎక్స్‌టిలో విడుదలైంది.

గుర్తుందా శీతాకాలం : తమన్నా, సత్యదేవ్‌ నటించిన ‘గుర్తుందా శీతాకాలం’ 20.1.2023వ తేదీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో విడుదలైంది.

ధమాకా : రవితేజ, శ్రీలీల నటించిన ‘ధమాకా’ 22.1.2023 నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.

18 పేజీస్‌ : నిఖిల్, అనుపమ పరమేశ్వరన్‌ నటించిన ’18 పేజీస్‌’ 27.1.2023వ తేదీ ఆహా అండ్‌ నెట్‌ప్లిక్సలో విడుదలైంది.

ఫిబ్రవరి

మాలికాపురం : చిన్నారుల కిడ్నాప్‌లపై తెరకెక్కిన చిత్రం ‘మాలికాపురం’. ఈ చిత్రంలో పోలీస్‌గా ఉన్ని ముకుందన్‌, చిన్నారి దేవ నందా నటించారు. సందేశాత్మకమైన ఈ చిత్రం 15.2.2023 (డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌)లో విడుదలైంది.

వారసుడు : ప్రముఖ హీరో విజరు, రష్మిక జంటగా నటించిన చిత్రం ‘వారసుడు’. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం సొంతం చేసుకుంది. 22.2.2023 ప్రైమ్‌ వీడియోలో విడుదలైంది.

వీర సింహారెడ్డి : బాలకృష్ణ, శృతిహాసన్‌ నటించిన చిత్రం ‘వీర సింహారెడ్డి’. ఈ చిత్రం 23.2.2023 డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో విడుదలైంది.

పులిమేక : లావణ్య త్రిపాఠి నటించిన వెబ్‌సిరీస్‌ జీ5లో 24.2.2023లో విడుదలైంది.

వాల్తేరు వీరయ్య : చిరంజీవి, శృతిహాసన్‌ నటించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ఈ చిత్రం 27.2.2023 నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.

మార్చి

రానా నాయుడు : వెంకటేష్‌, హీరో రానా కలిసి నటించిన వెబ్‌ సిరీస్‌ ‘రానా నాయుడు’. ఈ సిరీస్‌ మార్చి 10 నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.

రైటర్‌ పద్మభూషణ్‌ : సుహాస్‌ నటించిన చిత్రం ‘రైటర్‌ పద్మభూషణ్‌’. ఈ చిత్రం 17.3.2023 జీ 5లో విడుదలైంది.

సార్‌ : ప్రముఖ హీరో ధనుష్‌ నటించిన చిత్రం ‘సార్‌’. ఈ చిత్రం 17.3.2023వ తేదీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.

పంచతంత్రం : ప్రముఖ హాస్యనటుడు నటించి చిత్రం ‘పంచతంత్రం’. ఈ సినిమా 22 మార్చి 2023వ తేదీన ఈటివి విన్‌లో విడుదలైంది.

బలగం : జబర్దస్త్‌ కమెడియన్‌ తెరకెక్కించిన చిత్రం ‘బలగం’. చిన్న సినిమాగా విడదులై అంతర్జాతీయ గుర్తింపు పొందింది. ఈ చిత్రం 24.3.2023వ తేదీన ప్రైమ్‌ వీడియోలో విడుదలైంది.

ఏప్రిల్‌

అమిగోస్‌ : హీరో కళ్యాణ్‌రామ్‌ మూడు పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 1.4.2023 నెట్‌ప్లిక్స్‌లో విడుదలైంది.

రంగమార్తాండ : ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ, బ్రహ్మానందం తదితర తారాగణం నటించిన చిత్రం రంగమార్తాండ. ఈ చిత్రం 7.4.2023 ప్రైమ్‌ వీడియోలో విడుదలైంది.

దసరా : నాని, కీర్తిసురేష్‌ కలిసి నటించిన చిత్రం ‘దసరా’. ఈ సినిమా 27.4.2023 నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.

రావణాసుర : రవితేజ నటించిన చిత్రం ‘రావణాసుర’. ఈ సినిమా 28.4.2023 ప్రైమ్‌ వీడియోలో విడుదలైంది.

మే

ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి : నాగశౌర్య, మాళవిక నాయర్‌ నటించిన చిత్రం. ఈ సినిమా 5.5.2023 సన్‌ నెక్ట్స్‌లో విడుదలైంది.

శాకుంతలం : సమంత నటించిన ఇతిహాస చిత్రం ‘శాకుంతలం’. ఈ సినిమా 11.5.2023 ప్రైమ్‌ వీడియోలో విడుదలైంది.

రుద్రుడు : రాఘవ లారెన్స్‌ నటించిన చిత్రం ‘రుద్రుడు’. ఈ సినిమా 14.5.2023 సన్‌ నెక్ట్స్‌లో విడుదలైంది.

విరూపాక్ష : సాయిధరమ్‌ తేజ, సంయుక్త మీనన్‌ నటించిన చిత్రం ‘విరూపాక్ష’. ఈ సినిమా 21.5.2023 నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.

తోడేలు : వరుణ్‌ ధావన్‌ నటించిన చిత్రం ‘తోడేలు’. ఈ సినిమా 25.5.2023వ తేదీన ‘జియో’లో విడుదైలంది.

సత్తిగాని రెండెకరాలు : వెన్నెల కిశోర్‌, జగదీష్‌ ప్రతాప్‌ బండారి కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘సత్తిగాని రెండెకరాలు’. ఈ సినిమా 26.5.2023 ఆహాలో విడుదలైంది.

జూన్‌

పొన్నియన్‌ సెల్వన్‌ పార్ట్‌ 2 : ఐశ్వర్యరారు, త్రిష, విక్రమ్‌, కార్తీలు నటించిన చిత్రం ‘పొన్నియన్‌ సెల్వన్‌’. ఈ సినిమా 2.6.2023 ప్రైమ్‌ వీడియోలో విడుదలైంది.

ఉగ్రం : నరేష్‌ నటించిన యాక్షన్‌ మూవీ ‘ఉగ్రం’. 2.6.2023 ప్రైమ్‌ వీడియో2018 7.6.2023 సోనీలివ్‌ స్ట్రీమింగ్‌ అయింది.

కస్టడీ : నాగచైతన్య నటించిన ‘కస్టడీ’ మూవీ 9.6.2023 ప్రైమ్‌ వీడియో వేదికగా విడుదలై అలరించింది.

బిచ్చగాడు 2 : విజరు ఆంటోని నటించిన చిత్రం ‘బిచ్చగాడు 2’. బిచ్చగాడు సినిమా సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం 18.6.2023 డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో విడుదలైంది.

మళ్లీ పెళ్లి : సీనియర్‌ నరేష్‌, పవిత్రా లోకేష్‌ నటించిన చిత్రం ‘మళ్లీ పెళ్లి’. సినీ ఇండిస్టీలో సంచలనం రేకెత్తించిన ఈ చిత్రం 23.6.2023 ప్రైమ్‌ వీడియో అండ్‌ ఆహా వేదికగా విడుదలైంది.

విమానం : సముద్రఖని నటించిన మూవీ ‘విమానం’. ఈ చిత్రం 30.6.2023 జీ5 వేదికగా విడుదలైంది.

జూలై

సీనియర్‌ నటుడు బాలకృష్ణ తొలిసారి హోస్ట్‌గా వ్యవహరించిన షో ‘అన్‌స్టాపబుల్‌’. ఈ షో 20.7.2023 ప్రైమ్‌ వీడియో వేదికగా అలరించింది.

స్పై : హీరో నితిన్‌ యాక్షన్‌ మూవీలో అయిన ‘స్పై’ చిత్రంలో నటించారు. ఈ సినిమా 27.7.2023 ప్రైమ్‌ వీడియో వేదికగా విడుదలైంది.

సామజవరగమన : హీరో శ్రీవిష్ణు, సీనియర్‌ నటుడు నరేష్‌, రెబో మోనికా జాన్‌లు నటించిన ఈ చిత్రం తెరపై నవ్వులు పూయించింది. ఈ సినిమా 28.7.2023 ఓటీటీ ఆహాలో విడుదలైంది.

ఆగస్టు

హిడింబ : అశ్విన్‌బాబు, నందిత శ్వేత నటించిన చిత్రం హిడింబ. ఈ సినిమా ఆగస్టు 10.8.2023 ఆహా వేదికగా విడుదలైంది.

ఆదిపురుష్‌ : ప్రభాస్‌, కృతిసనన్‌లు నటించిన చిత్రం ‘ఆదిపురుష్‌’. ఈ చిత్రం 11.8.2023 ప్రైమ్‌ వీడియో వేదికగా విడుదలైంది.

బేబీ : ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్‌ ఆశ్విన్‌లు కలిసి నటించిన చిత్రం ‘బేబీ’. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం సొంతం చేసుకుంది. ఈ సినిమా 25.8.2023 ఆహా వేదికగా విడుదలైంది.

బ్రో : హీరో సాయిధరమ్‌ తేజ్‌, పవర్‌ స్టార్‌ పవన్‌కల్యాణ్‌లు కలిసి నటించిన చిత్రం ‘బ్రో’. ఈ సినిమా 25.8.2023 నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.

సెప్టెంబర్‌

ఉస్తాద్‌ : శ్రీసింహా, కావ్య కళ్యాణ్‌ రామ్‌లు కలిసి నటించిన చిత్రం 1.9.2023 ప్రైమ్‌ వీడియో వేదికగా విడుదలైంది.

జైలర్‌ : సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన చిత్రం ‘జైలర్‌’. ఈ సినిమా 7.9.2023 ప్రైమ్‌ వీడియో వేదికగా విడుదలైంది. రామబాణం : హీరో గోపీచంద్‌, జగపతిబాబు నటించిన చిత్రం రామబాణం. ఈ సినిమా 14.9.2023 నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. భోళా శంకర్‌ : మెగాస్టార్‌ చిరంజీవి, తమన్నాలు నటించిన చిత్రం ‘బోళా శంకర్‌’. ఈ సినిమా 15.9.2023 నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.

బెదురులంక : కార్తికేయ, నేహాశెట్టిలు నటించిన చిత్రం ‘బెదురులంక’. ఈ సినిమా 22.9.2023 ప్రైమ్‌ వీడియో వేదికగా విడుదలైంది.

గాంఢవీదారి అర్జున : వరుణ్‌తేజ్‌, సాక్షి వైద్యలు నటించిన చిత్రం ‘గాంఢవీదారి అర్జున’. ఈ సినిమా 24.9.2023 నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.

కుమారి శ్రీమతి : నిత్యా మీనన్‌ తొలిసారి నటించిన సిరీస్‌ ‘కుమారి శ్రీమతి’. ఈ సిరీస్‌ 28.9.2023 ప్రైమ్‌ వీడియో వేదికగా విడుదలైంది.

సప్త సాగరాలు దాటి సైడ్‌ – ఎ : 29.9.2023 ప్రైమ్‌ వీడియో వేదికగా విడుదలైంది.

అక్టోబర్‌

ఖుషి : సమంత విజరు దేవరకొండ నటించిన చిత్రం 1.10.2023 నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.

మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పోలిశెట్టి : నవీన్‌పోలిశెట్టి, అనుష్కలులు నటించిన చిత్రం. ఈ సినిమా 5.10.2023 నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.

మార్క్‌ ఆంటోని : విశాల్‌, ఎస్‌.జె.సూర్య, అభినయ, రీతూవర్మలు నటించిన చిత్రం ‘మార్క్‌ ఆంటోని’. ఈ సినిమా 13.10.2023 ప్రైమ్‌ వీడియో వేదికగా విడుదలైంది.

పెదకాపు : 27.10.2023 ప్రైమ్‌ వీడియో వేదికగా విడుదలైంది.

నవంబర్‌

స్కంద : రామ్‌పోతినేని, శ్రీలీల నటించిన చిత్రం స్కంద. ఈ సినిమా 2.11.2023 డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ వేదికగా విడుదలైంది.

మంత్‌ ఆఫ్‌ మధు : నవీన్‌చంద్ర, స్వాతి నటించిన ఈ చిత్రం 3.11.2023 ఆహా వేదికగా విడుదలైంది.

బార్సు హాస్టల్‌ : రష్మి, రిషబ్‌శెట్టి, తరుణ్‌భాస్కర్‌లు నటించిన చిత్రం ‘బార్సు హాస్టల్‌’. ఈ సినిమా 10.11.2023 ఈటివి విన్‌లో విడుదలైంది.

టైగర్‌ నాగేశ్వరరావు : రవితేజ నటించిన ‘టైగర్‌ నాగేశ్వరరావు’ సినిమా 17.11.2023 ప్రైమ్‌ వీడియోలో విడుదలైంది.

భగవంత్‌ కేసరి : నందమూరి బాలకృష్ణ, శ్రీలీల తండ్రీకూతుళ్లుగా నటించిన చిత్రం ‘భగవంత్‌ కేసరి’. ఈ సినిమా 24.11.2023 ప్రైమ్‌ వీడియో వేదికగా విడుదలైంది.

చిన్నా : సిద్ధార్థ్‌ నటించిన చిన్నా మూవీ 28.11.2023 డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో విడుదలైంది.

మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ : సంపూర్ణేశ్‌బాబు నటించిన ఈ సినిమా 29.11.2023 సోనీ లివ్‌లో విడుదలైంది.

డిసెంబర్‌

వధువు : అవికాగోర్‌, నందులు నటించిన సిరీస్‌ ‘వధువు’. ఈ సిరీస్‌ డిసెంబర్‌ 8 డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ వేదికగా విడుదలైంది.

జపాన్‌ : కార్తీ నటించిన చిత్రం ‘జపాన్‌’. ఈ సినిమా డిసెంబర్‌ 11 నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.

ఆదికేశవ : వైష్ణవ్‌తేజ్‌, శ్రీలీల నటించిన ‘ఆదికేశవ’ సినిమా 22.12.2023 నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

 

➡️