సంగీత రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం ఇటీవల అమెరికా లాస్ ఏంజిల్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రపంచదేశాలకు చెందిన సినీ ప్రముఖులు పాల్గొని తమ పాటలతో అలరించారు. భారతీయ సంగీత కళాకారులు శంకర్ మహదేవన్, జాకిర్ హుస్సేన్ కూడా ఈ వేదికపై విజయకేతనం ఎగురవేశారు. వీళ్లు కంపోజ్ చేసిన ‘దిస్ మూమెంట్’ ఉత్తమ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ అవార్డును సొంతం చేసుకుంది. ఈ పాటను జాన్ మెక్లాఫ్లిన్ (గిటార్), జాకిర్ హుస్సేన్ (తబలా), శంకర్ మహదేవన్ (సింగర్), గణేశ్ రాజగోపాలన్ (వయోలిన్) వంటి ప్రతిభావంతులైన ఎనిమిది మంది ‘శక్తి’ బ్యాండ్ పేరిట కంపోజ్ చేశారు. గ్రామీ పోటీల్లో ఈ బ్యాండ్ విజేతగా నిలిచింది. గ్రామీ 2024 విజేతలు వీరే.. ఉత్తమ ర్యాప్ ఆల్బమ్-మైఖేల్ (కిల్లర్ మైక్), ఉత్తమ ఆఫ్రికన్ సంగీత ప్రదర్శన – టైలా (వాటర్), మ్యాజిక్ వీడియో – జోనథన్ క్లైడ్ ఎమ్ కూపర్ (ఐయామ్ ఓన్లీ స్లీపింగ్), గ్లోబల్ మ్యూజిక్ ప్రదర్శన – జాకిర్ హుస్సేన్, బెలా ఫెక్ (పష్టో), గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ – శక్తి (దిస్ మూమెంట్), ఉత్తమ క్లాసికల్ సోలో వోకల్ ఆల్బమ్ , జూలియా బూల్లక్, సోలోయిస్ట్ (వాకింగ్ ఇన్ ద డార్క్), ఉత్తమ రాక్ ఆల్బమ్ – పారామోర్ (దిస్ ఇజ్ వై), ఉత్తమ రాక్ సాంగ్, ప్రదర్శన – బారుజెనియస్ (నాట్ స్ట్రాంగ్ ఎనఫ్), ఉత్తమ కామెడీ ఆల్బమ్ – డేవ్ చాపెల్ ( వాట్స్ ఇన్ ఏ నేమ్), ఉత్తమ కంట్రీ సాంగ్, సోలో ప్రదర్శన – క్రిస్ స్టేప్లెటన్ (వైట్ హార్స్).
![](https://prajasakti.com/wp-content/uploads/2024/02/sanker.jpg)