ఈ వారం ఓటీటీలోనూ.. థియేటర్లలోనూ విడుదలయ్యే చిత్రాలివే..

Mar 4,2024 13:39 #OTT

ఇంటర్నెట్‌ డెస్క్‌ : వారం వారం థియేటర్‌లోనూ.. ఓటీటీలోనూ సినిమాలు విడుదలయి సందడి చేస్తున్నాయి. మరి ఈ వారం ఓటీటీలోనూ.. థియేటర్‌లోనూ ఏయే చిత్రాలు విడుదల కానున్నాయో తెలుసుకుందామా..!

భీమా

ప్రముఖ నటుడు గోపీచంద్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘భీమా’. ఈ చిత్రంలో మాళవికా శర్మ, ప్రియా భవానీ శంర్‌ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని కన్నడ దర్శకుడు ఎ. హర్ష తెరకెక్కించారు. ఈ సినిమాలో గోపీచంద్‌ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. ఈ చిత్రం మార్చి 8వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

గామి

నటుడు విశ్వక్‌సేన్‌ నటించిన తాజా చిత్రం ‘గామి’. ఈ చిత్రంలో విశ్వక్‌ అఘోరగా కనిపించనున్నారు. ఈ చిత్రంతో విద్యాధర్‌ కాగిత దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో చాందినీ చౌదరి హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రం మార్చి 8వ తేదీన విడుదల కానుంది.

బాయ్స్

అజయ్, వంశీ ఏకశిరి, ఆదిత్య శశాంక్‌ నేతి, రోమిక శర్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘వి లవ్‌ బ్యాడ్‌ బార్సు’. ఈ చిత్రాన్ని రాజు రాజేంద్రప్రసాద్‌ తెరకెక్కించారు. హాస్యం ప్రధానంగా రూపొందిన ఈ చిత్రం మార్చి 8వ తేదీన విడుదల కానుంది.

రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి

రవితేజ నున్న, నేహా జురెల్‌ జంటగా నటించిన చిత్రం ‘రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి’ . ఈ చిత్రాన్ని దర్శకుడు సత్యరాజ్‌ తెరకెక్కించారు. ఈ మూవీ మార్చి 9వ తేదీన రిలీజ్‌ కానుంది.

షైతాన్‌

ప్రముఖ నటి జ్యోతిక, అజరు దేవగణ్‌, ఆర్‌. మాధవన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘షైతాన్‌’. ఈ చిత్రాన్ని వికాస్‌ బV్‌ా్ల తెరకెక్కించారు. ఈ సినిమా మార్చి 8వ తేదీన విడుదల కానుంది.

ఓటీటీ

వళరి ప్రముఖ నటి రితికా సింగ్‌ నటించిన హారర్‌ మూవీ ‘వళరి’. ఈ సినిమాలో శ్రీరామ్‌ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రాన్ని మ్రితికా సంతోషిణి తెరకెక్కించారు. ఈ సినిమా ఓటీటీ ‘ఈటీవీ విన్‌’లో మార్చి 6 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సోనీలివ్‌

మహారాణి (హిందీ వెబ్‌సిరీస్‌) : మార్చి 7

➡️