ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచే సినిమాలేంటి?

Jan 8,2024 16:02 #movie, #OTT

ఇంటర్నెట్‌డెస్క్‌ : ఈ ఏడాది సంక్రాంతి బరిలో టాలీవుడ్‌ ప్రముఖ హీరోలు నటించిన చిత్రాలు నిలిచాయి. టాలీవుడ్‌ సీనియర్‌ నటులు వెంకటేష్‌, నాగార్జున, మహేష్‌బాబు నటించిన చిత్రాలు ఎప్పుడు విడుదల కానున్నాయో తెలుసుకుందామా..?!

గుంటూరు కారం

హీరో మహేష్‌బాబు నటించిన తాజా చిత్రం ‘గుంటూరు కారం’. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. హారిక, హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌. రాధాకృష్ణ నిర్మించారు. ఈ సినిమాకు ఎస్‌.ఎస్‌. తమన్‌ సంగీతం అందించారు. ఈ చిత్రం జనవరి 12న థియేటర్లలో విడుదల కానుంది.

హనుమాన్‌

జాంబిరెడ్డి చిత్రంతో వెండితెరకు హీరోగా పరిచయమైన హీరో తేజ సజ్జా. బాలనటుడిగా కెరీర్‌ని ప్రారంభిచిన తేజ హీరోగానూ విజయం సాధిస్తున్నాడు. తాజాగా తేజ నటించిన చిత్రం ‘హనుమాన్‌’. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌కుమార్‌, అమృత అయ్యర్‌, వెన్నెలకిషోర్‌, జబర్దస్త్‌ కమెడియన్‌ గెటప్‌శ్రీను, సత్య వంటి తదితర తారాగణం నటించింది. ఈ సినిమాకు ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహించారు. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం జనవరి 12న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకు నిరంజన్‌ రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు.

సైంధవ్‌

ప్రముఖ హీరో వెంకటేష్‌ నటించిన తాజా చిత్రం ‘సైంధవ్‌’. తండ్రీ కూతుళ్ల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్‌ వెంకటేష్‌కి జోడీగా నటించారు. డైరెక్టర్‌ శైలేష్‌కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి వెంకట్‌ బోయనపల్లి నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం వెంకటేష్‌ 75వ సినిమా కావడం విశేషం.

నా సామిరంగ

టాలీవుడ్‌ ప్రముఖ హీరో నాగార్జున నటించిన తాజా చిత్రం ‘నా సామిరంగ’. ఈ సినిమాలో అల్లరి నరేష్‌, రాజ్‌తరుణ్‌లు కీలక పాత్ర పోషించారు. హీరోయిన్‌గా ఆషికా రంగనాథ్‌ నటించారు. దర్శకుడు విజరు బిన్ని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 14న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకు ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. శ్రీనివాస చిట్టూరి నిర్మించారు.

అయాలాన్‌

కోలీవుడ్‌ హీరో శివకార్తికేయన్‌ నటించిన తాజా చిత్రం ‘అయలాన్‌’. ప్రముఖ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కథానాయికగా నటించారు. కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 12న థియేటర్లలో విడుదల కానుంది.

ఆహా

ప్రముఖ హీరో శ్రీకాంత్‌ కీలకపాత్రలో పోషించిన సినిమా కోటబొమ్మాళి. ఈ చిత్రం జనవరి 11న ఓటీటీ ఆహా వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది.

➡️