ఎర్రా ఎర్రని పండు

Mar 31,2024 04:56 #Kavitha, #pomegranates

ఎర్ర ఎర్రాని పండు
నిగ నిగలాడుతుండు
కంటికి ఇంపుగా నుండు
గింజలే కమ్మగా ఉండు

పోషకాలే దండిగుండు
నిరోధకశక్తే మెండు
జ్ఞాపక శక్తి దాగుండు
జీర్ణక్రియే బాగుండు

ఒత్తిడినే తగ్గించును
వృద్ధాప్యమే నెమ్మదౌను
జుట్టురాలుట ఆపును
ఔషధాలే నిలువెల్లను

పలు విటమిన్లు లభించును
ఖనిజ లవణాలు ఇచ్చును
పలు లాభాలు చేకూర్చును
చర్మ సౌందర్యమే పెంచును

దాని గింజలు ముత్యాలు
దాని పిల్లలు రత్నాలు
దాని దేహమే లావణ్యం
దాని రసమే మాధుర్యం

అది పండేను మెట్ట ప్రాంతం
మది నిండేను ఆద్యంతం
అది పంచేను అమ్మ ప్రేమ
దాని పేరే, దానిమ్మా!

– గుండాల నరేంద్రబాబు,
94932 35992.

➡️