తాటి ముంజలు

May 26,2024 03:55 #feachers, #Jeevana Stories, #Kavitha

తాటి ముంజలు… తాటి ముంజలు
వేసవిలో చలువనిచ్చే ఐస్‌ యాపిళ్లు
చూడగానే సిజేరియన్‌ బేబీల్లా ముద్దొచ్చి
పట్టుకుంటే జారిపోయే తాటిముంజలు
నోట్లో చల్లగా కరిగిపోయే తాటిముంజలు
ముఖం మీది మొటిమలకు లేపనం
చెమటకాయలకు చక్కటి ఉపశమనం
విటమిన్లు మెండు మలబద్ధకానికి మందు
రూపులో లిచి పండును పోలివుండు
రుచియోమో లేత కొబ్బరిలా వుండు
తాటికాయల జోడెడ్ల బండి ఆట
వేసవిలో మదికి పన్నీటి జల్లుల పాట
పిల్లలు పెద్దలు ప్రియమార పలికే మాట
తాటి ముంజలు.. తాటి ముంజలు!

– సురేంద్ర రొడ్డ,
94915 23570.

➡️