మధుర ఫలాలు

May 24,2024 04:30 #jeevanaa

ఆకారంలో చిన్న
తీపిలో తేనె కన్నా మిన్న
పోషకాలు అధికం కన్నా
అనారోగ్యం సున్నా!

వచ్చినప్పుడే తినాల్సినవి
మళ్లీ వేసవి వచ్చు వరకు దొరకనివి
ఆరోగ్యానికి మేలైనవి
తప్పక తిని తీరాల్సినవి!

సరసమైన ధరలకు లభిస్తూ
సామాన్యులకూ అందుబాటులో ఉంటూ
మధుర ఫలాలను తలపిస్తూ
మళ్ళీ మళ్ళీ తినాలనిపించే చెట్టుకాయలు!

వేసవి మాత్రమే ఇచ్చు వరాలు
ప్రకృతి వర ప్రసాదితాలు
చెట్టున పండు కాయలు
ఎర్రంగ నుండు ఈత కాయలు!

– ఆళ్ల నాగేశ్వరరావు,
74166 38823.

➡️