రుచుల రాజు

Jan 21,2024 09:46 #jeevana

గుంటూరు గోంగూర

మేడారం మిరపకాయ

ఉప్పాడ ఉప్పు కలిపి

పచ్చడిగా దంచి కొట్టు

 

సాలూరు సన్నాలు

అన్నంగా వండి పెట్టు

అత్తిలి ఆవకాయ

గిన్నె నందు సర్ది పెట్టు

 

పళ్ళెమందు అన్నముంచి

అందు కలుపు ఈ పచ్చడి

ఆ ముద్దను నోట పెట్టి

ఆవకాయ రుచి చూడు

 

భలే రుచి భలే రుచి

తినగలరు మైమరచి

తెలుగువారి శాకమిది

రుచులకెల్ల రాజు ఇది !

– బి.వి పట్నాయక్‌

➡️