నీకోసం..

Jun 23,2024 11:47 #kavithalu, #Sneha

చిగురించే మమతలకు..
ఎప్పుడైనా నీప్రేమతో
నీరు పోశావా..?
మాటల గొడ్డలితో
చాటు మాటుగా నరికేస్తూ…
వెటకారంగా ఎదుట పడిన వేళ…
నీడనివ్వలేదంటూ నన్ను నిందిస్తుంటావే!
నీకై దాతృత్వం కొమ్మలుగా వంగిన నాడు
గుట్టు చప్పుడు కాకుండా,
గుత్తులు గుత్తులుగా తెంపుకున్న పూలను
లెక్క పెట్టుకోవడం మరచిపోతుంటావే!
నాపై వీచే, నీ స్వార్థపు గాలికి, ఆకులు రాలి
విస్తరించిన నేను మోడుగా మిగిలినా..
నీకోసం కొత్తగా మళ్ళీ మళ్ళీ
చిగురిస్తూనే ఉంటాను!
నేలకు ఒరిగే దాకా..
నీకు నీడనిస్తూనే ఉంటాను!!

పద్మజా రామకృష్ణ.పి.
9491830278.

➡️