గజల్‌

Feb 25,2024 11:31 #kavithalu, #Sneha

కలిసి నడిచే మనుషులతో దూరం దగ్గరవుతుంది

కలిసి చరించే మనసులతో భారం నెమ్మదవుతుంది

అహంకారపు పొరలు కమ్మితే అంతా నరకమే

మది విశాల పరచుకో జీవితం స్వర్గమవుతుంది

నీకోసం నీవే బ్రతికితే ఏమున్నది పరమార్థం

పరులకై బ్రతికిచూడు హృదయం స్వచ్ఛమవుతుంది

ఎదుటివారి తప్పులే ఎత్తిచూపకు ఎప్పుడూ

నీలోకి తొంగి చూడు అంతరంగం స్పష్టమవుతుంది

కఠినమైన ఊహలకు తావివ్వకు నేస్తమా

లలితభావాలు పంచిచూడు లోకం సొంతమవుతుంది!

లలితావర్మ

9949672671

➡️