కడదాకా యుద్ధమే..

Feb 25,2024 11:42 #kavithalu, #Sneha

అదిగో అక్కడ

సోక్రటీసు

సంగీతం నేర్చుకుంటున్నాడు

‘లైర్‌’ వాయిద్యం మీద

ఇంకాసేపట్లో చనిపోతాడు’

జిజ్ఞాస’

ఇదిగో ఇక్కడ

స్టీఫెన్‌ హాకింగ్‌

బ్లాక్‌ హోల్స్‌ వెదుకుతున్నాడు

ఎప్పుడు మరణిస్తాడో తెలియదు

‘పిపాస’

అటుచూడు

గుడ్డి బిచ్చగాడు

మండుటెండలో యాచిస్తున్నాడు

ఎలాగైనా బతకాలని

‘తపన’

ఇటువైపు

వయోవృద్ధుడు

కాటికి కాళ్ళు చాపేశాడు

క్షణాలు లెక్కపెడుతూ

‘అస్త్ర సన్యాసం

‘చివరిగా

నవ యువకుడు

పగటి కలలు కంటున్నాడు

పని చేయకుండా’

నిష్క్రియాపరత్వం’

ప్రవాహం.. ఆగితే గడ్డ కడుతుంది

ప్రయత్నం.. వీడితే మోడువారుతుంది

ప్రయాణం.. ఓడితే ప్రాణమే పోతుంది

డాక్టర్‌ కౌలూరి ప్రసాదరావు

7382907677

➡️