ఆనంద క్షణాలు

Dec 4,2023 13:54 #Sneha

చందమామ అందుకున్న

ఆనంద క్షణాలు

కళ్లెదుటే సాక్షత్కారించింది

కోడినిద్రలో కునుకు తీసినా

వేకువజామున నిద్ర మత్తు

పారిపోయింది

పిండివెన్నెల్లో మెరిసిపోయిన

జాబిలి తన దారేదో

తాను చూసుకుంది

వేకువ పిట్టేదో గబాలున

తొంగి చూసి కిసుక్కున నవ్వి

చిట్టుక్కున మాయమైపోయింది

క్రమశిక్షణ గల సైనిక చీమల్లా

అన్నదాత అడుగు తడబడకుండా

చేనువైపుకు పడుతోంది

గట్టు మీద గుబురు చెట్టు మీద

తీతువు పిట్టొకటి కచ్చేరి చేస్తుంది

ఆకుపచ్చ కోకలా

కళకళలాడవలసిన చేను

ఎండిన మోళ్ళతో ఉసూరు మంటోంది

వర్షరుతువులో నైరుతి పవనం

ముఖం చాటేసింది

గగనమంతా కర్ఫ్యు

విధించి నట్లే..

ఒక్క మేఘపు చాయా

ఆగుపడటం లేదు

వాన రాకడ

ప్రాణం పోకడ

తెలియనట్టే

నేతలకు కర్షకునిపై దయ

ఎప్పుడు

కలుగుతుందో

తెలియకుంది

నలుగురికి అన్నం పెట్టే చేయి

దీనస్థితిలో వర్షం కోసంఎదురు చూస్తుంది

చినుకు పడాలి పంటలు పండాలి

రైతు మోములో..ఆనంద క్షణాలు చూడాలి.. – గాదిరాజు రంగరాజు87901 22275

➡️