ప్రకృతి పరిఢవిల్లాలి

Jun 16,2024 10:40 #Sneha

ఎంతో అద్భుతం మన ప్రకృతి
ఎక్కడ చూసినా పరిఢవిల్లుతోంది
పట్టణాల సంగతి అటుంచితే
పల్లెల్లో విరిసేనే ప్రకృతి పరిమళాలు
పల్లెపట్టున చేనుగట్టున
చెట్టు కొమ్మన కొమ్మ కొమ్మన
కమ్మనిగీతంలో కోయిల గానాలు
ఎటుచూసినా పక్షుల కిలకిలా రావాలు
కొండలు, కోనలు, గట్లు, చెట్లు, పుట్టలు
కొండచాటున ఏటిగట్టున
నీటి ఒడ్డున గుండెనిండిన
ఝమ్మనినాదం చేసే పురుగులు
వాగులు వంకలు
కొండలు కోనలు
బండలు అండలు
ఏరులు దారులు దాటి
ఎటు చూసినా గల గలమని పారుతున్న జలసిరులు
కుహూ..కుహూ… కూనిరాగాల
కోయిలమ్మలు…ఆహా..ఓహో అనేలా
సంతోషంతో గుండె నింపుకొని
ఆనందంగా అనుబంధాలను పెంచే
పల్లెటూర్లు… పల్లె జనాలు.. జానపదాలు
వింటుంటే ఎంతో సంతోషం.. మరెంతో ఆనందం..!

నున్న దీక్షిత,
10వ తరగతి, సెయింటాన్స్‌ స్కూల్‌, బక్కన్నపాలెం, మధురవాడ, విశాఖపట్టణం.

➡️