ఇక్కడొక కొలనుండేది

Jun 16,2024 11:23 #Sneha

ఎక్కడ నుండి వచ్చిందో
ఒక లేడి పిల్ల
చెత్త నుండి సంపద కేంద్రం చుట్టూ
తచ్చాడుతూ ఎగాదిగా చూస్తుంది

పక్కనున్న గడ్డిపోచ
మొదట ముడుచుకొని
గడ్డి మేయని లేడిపిల్లను
తదేకంగా చూస్తూ ..
ఉబుసుపోక అడిగేసింది

‘ఏంటోరు.. నువ్వు కూడా
చెత్త నుండి సంపద కేంద్రంలో
బంగారం వెతుకుతున్నావా..?

పీక్కు పోయిన కళ్ళతో
దీనంగా చూస్తూ..
‘ఎప్పుడో అమ్మతో వచ్చినట్టుగా గుర్తు
ఇక్కడొక కొలనుండేది
ఎక్కడా నీరు దొరక్కపోతే
ఇక్కడకు వచ్చేవాళ్లం
అదే వెతుకుతున్నా’ అంది
తడారిన గొంతుతో లేడిపిల్ల

‘అరరే!…
ఇప్పుడది సంపద కేంద్రం
ఇక్కడ వజ్రాలు పండుతాయట..!
దొరికితే కడుపారా తాగి
దాహం తీర్చుకో’ అంది గడ్డిపోచ
దుఃఖాన్ని దిగమింగుకుంటూ

కుత్తుం అమృత,
8వ తరగతి
మాకన్నపల్లి
9634314502

➡️