అటకెక్కిన కులగణన!

Mar 20,2024 06:20

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : అత్యంత అట్టహాసంగా నిర్వహించిన కులగణను రాష్ట్ర ప్రభుత్వం అటకెక్కించినట్లుగా తెలిసింది. విశ్వసనీయ వర్గాలు తెలిపిన సమాచార ప్రకారం కులగణన పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన సర్వే వివరాలను పక్కన పెట్టేయనున్నారు. గతంలో ఈ సర్వే వివరాలను పుస్తకరూపంలో తీసుకురావాలని నిర్ణయించినప్పటికీ తాజాగా ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ప్రింటింగ్‌ పనులు నిలిపివేయాలని ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం. కులగణనలో సేకరించిన వివరాలు అసమగ్రంగా ఉరడడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ప్రభుత్వంలోని ఒక సీనియర్‌ అధికారి దీనిని ధృవీకరించారు. దీంతో కులగణన కార్యక్రమం అటకెక్కినట్టేనని ఆయన వ్యాఖ్యానించారు. 2011-12లో దేశ వ్యాప్తరగా ఈ తరహాలోనే ఒక సర్వే నిర్వహించారని, అది కూడా ఇప్పటివరకు గెజిట్‌ కాలేదని ఆయన గుర్తుచేస్తుండటం విశేషం. అయితే, కులగణన వివరాలు ఎంత అసమగ్రంగా ఉన్నప్పటికీ, అవి అధికారపార్టీ చేతికి ఇప్పటికే అందినట్లు భావిస్తున్నారు. ఇతర పార్టీలకు అందుబాటులో లేకపోవడంతో ఎనికల వేళ వైసిపికి ఇది ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉంది.
సచివాలయాల శాఖ వద్దే….
ఇప్పటికి వరకు కులగణన వివరాలు ప్రణాళిక శాఖ వద్దకు కూడా చేరలేదని తెలిసింది. ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించింది ప్రణాళిక శాఖే అయినప్పటికీ, సర్వే చేసింది మాత్రం వార్డు, గ్రామ సచివాలయాల కార్యదర్శులు. వారికి వాలంటీర్లు సహకరించారు. గత నెల 20వ తేదికే వివరాల సేకరణ పూర్తయినప్పటికీ, అవి సచివాలయాల శాఖ వద్దే నిలిచిపోయినట్టు చెబుతున్నారు.
ఉపకులాలపై ఆరా…
గతంలో పలు సర్వేల ద్వారా కులాల వివరాలు సేకరిరచినప్పటికీ వాటిల్లో ఉప కులాల వివరాలు మాత్రం లేవని అధికారులు చెబుతున్నారు. తాజాగా చేసిన కులగణనలో ఉప కులాల వారీగా ఎరత మంది జనాభా ఉన్నారన్న అంశంపై ప్రధానంగా దృష్టిసారించారు. క్షేత్రస్థాయిలో ప్రాధాన్యతలను నిర్దారించుకోవడానికి ప్రభుత్వాధినేతలకు, విధాన రూపకర్తలకు ఈ సమాచారం ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే, అధికారులు మాత్రం ఉపకులాలకు సంబంధించిన అంశాలను చెప్పడానికి ప్రజలు ఆసక్తి చూప లేదని అంటున్నారు.
సహకరించని ప్రజలు…
కులాల వివరాలే కాకుండా వారి ఆర్థిక పరిస్థితి, ఆస్తులు, ఇళ్లలో ఉన్న పశువుల వివరాలు, గొర్రెలు, వంట కోసం వినియోగిస్తున్న గ్యాస్‌, విద్యుత్‌ స్టౌ, వంట చెరకు, గోబర్‌ గ్యాస్‌, బయో ఇరధనం వంటి విధానాలను కూడా తెలుసుకోవాలని ప్రయత్నిరచారు. వారి జీవన విధానం, ఆదాయ వనరులు, వారికి ఉన్న వ్యవసాయ భూమి, ఇళ్లు వంటి వాటిపైనా వివరాలతోపాటు, 50 సెరట్లు కన్నా తక్కువ వ్యవసాయ భూమి ఉన్న వారు, అరతకు మిరచి భూమి ఉన్న వారి వివరాలను కూడా సేకరించాలన్నది కుల గణన లక్ష్యం. ఇటువంటి కీలక సమాచారాన్ని సర్వేలో కోరుతురడడంతో ప్రజల నురచి వ్యతిరేకత వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ఈ వివరాలకు ఆధార్‌ను కూడా అనుసంధానం చేయాలని నిర్ణయించడం కూడా ప్రజల వ్యతిరేకతకు కారణమని అంటున్నారు. మారుమూల, గిరిజన ప్రారతాల్లో నెట్‌వర్క్‌ సౌకర్యం లేకపోవడం కూడా సర్వేకు ఇబ్బరదులు కలిగిరచిందని సమాచారం.

➡️