ధర్మశాల :టెస్టు మ్యాచ్ ఆడటంతో రవిచంద్రన్ అశ్విన్ భారత్ తరఫున 100 టెస్టు మ్యాచ్‌లు ఆడిన 14వ టీమిండియా ప్లేయర్‌గా ఘనత సాధించనున్నాడు. అంతర్జాతీయంగా టెస్ట్ క్రికెట్లో మొత్తం 79మంది క్రికెటర్లు 100 టెస్టులు ఆడారు. అలాగే స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో ఘనతను అందుకోనున్నాడు. ఈ మ్యాచ్ ఆడటంతో అశ్విన్ టెస్టు క్రికెట్లో భారత జాతీయ జట్టు తరఫున 100 మ్యాచ్‌లు ఆడిన 14వ ప్లేయర్, ఐదో బౌలర్‌గా రికార్డు సృష్టించనున్నాడు. అంతకుముందు, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్, ఇషాంత్ శర్మలు భారత్ తరఫున 100 టెస్టు మ్యాచ్‌లను ఆడారు. అలాగే మూడో స్పిన్నర్‌గా అశ్విన్ నిలుస్తాడు. దీంతో పాటు దిగ్గజ బౌలర్ల రికార్డులను కూడా అశ్విన్ బ్రేక్ చేయనున్నాడు. ఈ సిరీస్‌లో ఇప్పటికే అనిల్ కుంబ్లే తర్వాత 500 టెస్టు వికెట్లు తీసిన రెండో భారతీయుడిగా అశ్విన్ చరిత్ర సఅష్టించాడు. టెస్టుల్లో కుంబ్లే భారత్ తరఫున అత్యధిక వికెట్లు (619 వికెట్లు) తీసిన బౌలర్ కాగా, అశ్విన్ కేవలం 98 మ్యాచ్‌ల్లోనే 500 వికెట్ల మైలురాయిని అత్యంత వేగంగా అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో రెండో క్రికెటర్‌గా రికార్డు.. 99 టెస్టులు ఆడి 584 వికెట్లు తీసిన ముత్తయ్య మురళీధరన్ తర్వాత 100వ టెస్టు ఆడే ముందు 500 వికెట్లు తీసిన తర్వాత ఈ మైలురాయిని పూర్తి చేసిన రెండో క్రికెటర్‌గా అశ్విన్ చరిత్రలో నిలిచాడు. 100 టెస్టు మ్యాచ్‌లకు ముందు 500 వికెట్లు తీసిన ఇద్దరిలో అశ్విన్ ఇప్పటికే రికార్డు సృష్టించాడు. 2011లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అశ్విన్ భారత్ తరఫున తన అరంగేట్రం చేసాడు. అప్పటి నుంచి టీమిండియా టాప్ బౌలర్‌గా కొనసాగుతున్నాడు.
99టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు..
మురళీధరన్(శ్రీలంక) : 584
అశ్విన్(ఇండియా) : 507
అనిల్ కుంబ్లే(ఇండియా) : 478
మెక్‌గ్రాత్(ఆస్ట్రేలియా) : 446
షేన్ వార్న్(ఆస్ట్రేలియా) : 436