ఆంధ్ర 235/4 -ఉత్తరప్రదేశ్‌తో రంజీ మ్యాచ్‌

Feb 9,2024 22:14 #Sports

విశాఖపట్నం: రంజీట్రోఫీ ఎలైట్‌ గ్రూప్‌-బిలో భాగంగా ఉత్తరప్రదేశ్‌తో ప్రారంభమైన లీగ్‌ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌ జట్టు బ్యాటర్లు రాణించారు. కెప్టెన్‌ రికీ బురు(90బ్యాటింగ్‌)కు తోడు శశికాంత్‌(72), కరణ్‌ షిండే(45బ్యాటింగ్‌) రాణించారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర ఓపెనర్లు ప్రశాంత్‌(14), మహీవ్‌ కుమార్‌(0) నిరాశపరిచారు. దీంతో ఆంధ్రజట్టు స్వల్ప విరామంలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో మాజీ కెప్టెన్‌ హనుమ విహారి(11) సహకారంతో శశికాంత్‌ అర్ధసెంచరీతో మెరిసాడు. విహారి ఔటయ్యాక కెప్టెన్‌ రికీ బురుాశశికాంత్‌ మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడారు. ఈ క్రమంలో శశికాంత్‌ అర్ధసెంచరీ పూర్తయ్యాక సౌరబ్‌ కుమార్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత రికీ బురు-కరణ్‌ షిండే కలిసి మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడారు. దీంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్రప్రదేశ్‌ జట్టు 80 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 235పరుగులు చేసింది. యుపి బౌలర్లు యశ్‌ దయాల్‌, అంకిత్‌ రాజ్‌పుత్‌, ఆకిబ్‌ ఖాన్‌, సౌరభ్‌ కుమార్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి. తన్మరు, తిలక్‌ వర్మ సెంచరీలు.. ప్లేట్‌ గ్రూప్‌లో హైదరాబాద్‌ ఓపెనర్‌ తన్మరు అగర్వాల్‌, కెప్టెన్‌ తిలక్‌ వర్మ సెంచరీలతో కదం తొక్కడంతో హైదరాబాద్‌ జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి 5వికెట్ల నష్టానికి 383పరుగులు చేసింది. ఉప్పల్‌ వేదికగా నాగాలాండ్‌తో గురువారం నుంచి ప్రారంభమైన మ్యాచ్‌లో తన్మరు అగర్వాల్‌(164), తిలక్‌ వర్మ(101బ్యాటింగ్‌) సెంచరీలతో కదం తొక్కారు. రోహిత్‌ రాయుడు(59) కూడా రాణించడంతో హైదరాబాద్‌ జట్టు భారీస్కోర్‌ దిశగా పయనిస్తోంది. నాగాలాండ్‌ బౌలర్లు జనాథన్‌కు రెండు, రెహమాన్‌, క్రివిట్సో, ఇమ్మివతిలకు ఒక్కో వికెట్‌ దక్కాయి.

➡️