ఊరిస్తున్న విజయం- న్యూజిలాండ్‌-దక్షిణాఫ్రికా రెండోటెస్ట్‌

Feb 15,2024 22:20 #Sports

హామిల్టన్‌: దక్షిణాఫ్రికాాన్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న రెండోటెస్ట్‌ రసకందాయంలో పడింది. మూడోరోజైన గురువారం దక్షిణాఫ్రికా జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 235పరుగులకు ఆలౌట్‌ కావడంతో న్యూజిలాండ్‌ జట్టు 267పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన న్యూజిలాండ్‌ జట్టు మూడోరోజు ఆటముగిసే సమయానికి వికెట్‌ నష్టపోయి 40పరుగులు చేసింది. విజయానికి న్యూజిలాండ్‌ జట్టు మరో 227పరుగులు చేయాల్సి ఉండగా.. దక్షిణాఫ్రికా జట్టు మరో 9వికెట్లు కూల్చితే ఆ జట్టుకు విజయం ఖాయం కానుంది. ఇరుజట్ల మధ్య జరుగుతున్న రెండు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌లో ఆతిథ్య న్యూజిలాండ్‌ జట్టు 1-0 ఆధిక్యతలో ఉన్న సంగతి తెలిసిందే.

➡️