జులైలో జింబాబ్వే పర్యటనకు టీమిండియా

Feb 6,2024 22:10 #Sports

ఐదు టి20ల సిరీస్‌ షెడ్యూల్‌ ఖరారు

ముంబయి: భారత్‌-జింబాబ్వే జట్ల మధ్య ఐదు టి20ల సిరీస్‌ షెడ్యూల్‌ ఖరారైంది. ఈ ఏడాది జులైలో జరిగే టీమిండియా ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ ఆడేందుకు జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. 2016 తర్వాత టీమిండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. ఈ ఏడాది జూన్‌లో టి20 ప్రపంచకప్‌ టోర్నీ జరగనుండగా.. అది ముగిసిన తర్వాత జులైలో టీమిండియా ఈ పర్యటనకు వెళ్లనున్నట్లు బిసిసిఐ ‘జింబాబ్వే క్రికెట్‌’ మంగళవారం ఓ ప్రకటనలో సంయుక్తంగా వెల్లడించాయి. జులై 6-14 మధ్య హరారే వేదికగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ నిర్వహించనున్నారు. జులై 6వ తేదీన తొలి, 7న రెండు, 10న మూడు, 13న నాలుగు, 14న ఐదో టి20 జరగనుంది. ద్వైపాక్షిక సిరీస్‌ల నిమిత్తం టీమిండియా ఆ దేశ పర్యటనకు వెళ్లడం ఇది నాలుగోసారి. అంతకుముందు 2010, 2015, 2016లో ఇరు దేశాలు టీ20 సిరీస్‌లు ఆడాయి.

➡️