టాపార్టర్‌ వైఫల్యం.. ఆర్సీబీని ఆదుకున్న పెర్రీ..

Mar 15,2024 22:30 #Sports

ముంబై ఎదుట ఈజీ టార్గెట్‌

న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) ఎలిమినేటర్‌ పోరులో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) తడబడింది. ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేస్తున్న ఆ జట్టు.. టాపార్డర్‌ వైఫల్యంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 135 పరుగులే చేయగలిగింది. ఆర్సీబీ ఆల్‌రౌండర్‌ ఎల్లీస్‌ పెర్రీ (50 బంతుల్లో 66, 8 ఫోర్లు, 1 సిక్సర్‌) మరోసారి జట్టును ఆదుకుంది. ముంబై బౌలర్లలో హేలీ మాథ్యూస్‌ (2/18), సీవర్‌ బ్రంట్‌ (2/18) లు ఆదిలోనే బెంగళూరును దెబ్బతీశారు. సైకా ఇషాక్‌ కూడా రెండు వికెట్లు తీసింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన ఆర్సీబీ.. ఇన్నింగ్స్‌ను దాటిగానే ఆరంభించింది. షబ్నిమ్‌ ఇస్మాయిల్‌ వేసిన తొలి ఓవర్లో మొదటి బంతికే స్మఅతి మంధాన (10) ఒక ఫోర్‌ కొట్టగా డెవిన్‌ (10) రెండు బౌండరీలు సాధించింది. కానీ రెండో ఓవర్లో ఆర్సీబీకి తొలి షాక్‌ తాకింది. మాథ్యూస్‌ వేసిన రెండో ఓవర్లో డెవిన్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయింది. మూడో ఓవర్లో నటాలీ సీవర్‌ బ్రంట్‌.. మంధానను ఔట్‌ చేసింది. సైకా ఇషాక్‌ వేసిన నాలుగో ఓవర్లో దిశా కసత్‌ డకౌట్‌ అయింది. రిచా ఘోష్‌ (19) కూడా విఫలమైంది. సోఫీ మొలినెక్స్‌ (11) ను సీవర్‌ బ్రంట్‌ పెవిలియన్‌కు పంపింది. 15 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ.. 84 పరుగులే చేసి 5 వికెట్లు కోల్పోయింది.ఆదుకున్న పెర్రీ..క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతున్నా ఆర్సీబీని పెర్రీ ఆదుకుంది. రిచా ఘోష్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 26 పరుగులు జోడించిన పెర్రీ.. మోలినెక్స్‌తో కలిసి 35 రన్స్‌ జతచేసింది. 16వ ఓవర్‌ వరకూ పరిస్థితులకు తగ్గట్టు ఆడిన పెర్రీ.. ఆ తర్వాత జోరు పెంచింది. ఇస్మాయిల్‌ వేసిన 17వ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టడంతో ఆమె అర్థ సెంచరీతో పాటు ఆర్సీబీ వంద పరుగులు పూర్తయ్యాయి. అమెలియా కెర్‌ వేసిన మరుసటి ఓవర్లోనూ రెండు ఫోర్లు కొట్టిన ఆమె.. సైకా ఇషాక్‌ వేసిన చివరి ఓవర్లో భారీ షాట్‌ ఆడబోయి నిష్క్రమించింది. జార్జియా వర్హెమ్‌ (10 బంతుల్లో 18 నాటౌట్‌) ఆఖర్లో ఫోర్‌, సిక్సర్‌తో రాణించింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని (136) ముంబై ఏ మేరకు ఛేదిస్తుందనేది ఆసక్తికరం.

స్కోర్‌బోర్డు…

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మహిళల ఇన్నింగ్స్‌: స్మృతి మంధాన (సి)షబ్నమ్‌ (బి)స్కీవర్‌ బ్రంట్‌ 10, సోఫీ డివైన్‌ (బి)మాథ్యూస్‌ 10, ఎలేసె పెర్రి (సి)స్కీవర్‌ బ్రంట్‌ (బి)షికా ఇషాక్‌ 66, దిశా కసత్‌ (సి)పూజ వస్త్రాకర్‌ (బి)షికా ఇషాక్‌ 0, రీచా ఘోష్‌ (సి)స్కీవర్‌ బ్రంట్‌ (బి)మాథ్యూస్‌ 14, మోలినెక్స్‌ (బి)స్కీవర్‌ బ్రంట్‌ 11, వారేహామ్‌ (నాటౌట్‌) 18, శ్రేయాంక పాటిల్‌ (నాటౌట్‌) 3, అదనం 3. (20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి) 136పరుగులు.

వికెట్ల పతనం: 1/20, 2/20, 3/23, 4/49, 5/84, 6/126

బౌలింగ్‌: షబ్నమ్‌ ఇస్మాయిల్‌ 4-1-30-0, మాథ్యూస్‌ 4-0-18-2, స్కీవర్‌ బ్రంట్‌ 4-0-18-2, శికా ఇషాక్‌ 3-0-27-2, పూజా వస్త్రాకర్‌ 3-0-21-0, అమెలియా కెర్ర్‌ 2-0-18-0

➡️