టీమిండియా సూపరో.. సూపర్‌..

Jan 18,2024 10:55 #Cricket, #India, #Sports, #t 20
  • రెండో సూపర్‌ ఓవర్‌లో ఆఫ్ఘన్‌పై భారత్‌ గెలుపు
  • రోహిత్‌ సెంచరీ, రింకు అర్ధసెంచరీ
  • టి20 సిరీస్‌ క్లీన్‌స్వీప్‌

బెంగళూరు: చిన్నస్వామి స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మూడో టీ20 ఉత్కంఠభరితంగా సాగింది. రెండు సూపర్‌ ఓవర్లకు దారితీసిన ఈ మ్యాచ్‌లో భారతజట్టు ఆఫ్ఘన్‌పై గెలిచి ఊపిరి పీల్చుకుంది. తొలుత భారత్‌ నిర్దేశించిన 213పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆఫ్ఘనిస్థాన్‌ 20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 212పరుగులు చేసింది. దీంతో ఈ మ్యాచ్‌ టైగా ముగియగా.. తొలి సూపర్‌ ఓవర్లో ఆఫ్ఘన్‌ 6బంతుల్లో వికెట్‌ నష్టానికి 16పరుగులు చేస్తే.. భారత్‌ కూడా వికెట్‌ నష్టపోయి 16పరుగులే చేసింది. దీంతో తొలి సూపర్‌ ఓవర్‌ టై అయ్యింది. ఇక రెండో ఓవర్‌లో టీమిండియా 11పరుగులకు ఆలౌట్‌ కాగా.. ఛేదనలో ఆఫ్ఘన్‌ ఒక్క పరుగుకే రెండు వికెట్లు కోల్పోయి పరాజయం పాలైంది. దీంతో టి20 చరిత్రలో ఓ మరుపురానిమ్యాచ్‌కు చిన్నస్వామి స్టేడియం వేదికైంది.

టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌కు ఫరీద్‌ అహ్మద్‌ మూడో ఓవర్లోనే షాక్‌ ఇచ్చాడు. మూడో బంతికి యశస్వి జైస్వాల్‌(4), కోహ్లి(0), శివమ్‌ దూబే(1), సంజూ శాంసన్‌(0) ఇలా వచ్చి అలా వెళ్లారు. దీంతో భారత్‌ 22 పరుగులకే 4వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాలో పడింది. ఆ దశలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సెంచరీకి తోడు, రింకూ సింగ్‌ అర్ధసెంచరీ తోడవ్వడంతో భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 212పరుగులు చేసింది. తొలుత టాపార్డర్‌ విఫలమైనా రోహిత్‌ శర్మ (121నాటౌట్‌; 69బంతుల్లో 11ఫోర్లు, 8సిక్సర్లు) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆరంభంలో ఆచితూచి ఆడిన హిట్‌ మ్యాన్‌.. ఆఖరి ఓవర్లలో తన మార్కు ఆట ఆడి శతకం బాదాడు. 64 బంతుల్లోనే సెంచరీ చేసిన రోహిత్‌కు ఇది టి20లలో ఐదో శతకం. రోహిత్‌కు తోడుగా నయా ఫినిషర్‌ రింకూ సింగ్‌ (69నాటౌట్‌, 39బంతుల్లో, 2ఫోర్లు, 6సిక్సర్లు) తోడైంది. ఇన్నింగ్స్‌ చివరి 12బంతుల్లో రోహిత్‌-రింకూ సింగ్‌ కలిసి 58పరుగులు రాబట్టారు. అదే క్రమంలో వీరిద్దరూ కలిసి టి20ల్లో ఓ వికెట్‌కు అత్యధిక పరుగుల భాగ స్వామ్యం(190పరుగులు) రికార్డు నెలకొల్పారు. అంత కుముందు ఇదిసంజు-హుడా(176పరుగులు) పేరిట ఉండగా.. తాజాగా ఆ రికార్డును బ్రేక్‌ చేశారు. అఫ్ఘన్‌ పేసర్‌ ఫరీద్‌ అహ్మద్‌కు మూడు వికెట్లు దక్కాయి.

ఆ తర్వాత 213 పరుగుల లక్ష్యఛేదనలో ఆఫ్ఘన్‌ జట్టు అద్భుతంగా పోరాడింది. ఆ జట్టు బ్యాటర్లు పోరాటపటిమ చూపడంతో కొండంత స్కోరు కూడా కరిగిపోయింది. చివరి ఓవర్లో ఆఫ్ఘనిస్థాన్‌ విజయానికి 19 పరుగులు అవసరం కాగా… 18పరుగులే చేయడంతో స్కోర్లు సమం అయ్యాయి. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు సరిగ్గా 212 పరుగులు చేసింది. ఆఫ్ఘన్‌ ఇన్నింగ్స్‌ లో రహ్మనుల్లా గుర్బాజ్‌ 50, కెప్టెన్‌ ఇబ్రహీం జాద్రాన్‌ 50 పరుగులతో రాణించారు. వీరిద్దరూ తొలి వికెట్‌ కు 93 పరుగులు జోడించి శుభారంభం అందించారు. ఆ తర్వాత గుల్బదిన్‌ నాయబ్‌, మహ్మద్‌ నబీ జోడీ భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంది. నాయబ్‌ 23 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 55 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. నబీ 16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 34 పరుగులు సాధిం చాడు. టీమిండియా బౌలర్లలో వాషింగ్టన్‌ సుందర్‌కు మూడు, అవేష్‌ ఖాన్‌, కుల్దీప్‌ యాదవ్‌ ఒక్కో వికెట్‌ తీశారు. ఇక ఈ మ్యాచ్‌ ఫలితం సూపర్‌ ఓవర్‌ ద్వారా తేలనుంది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ రోహిత్‌కు సిరీస్‌ దూబేకు దక్కాయి.

స్కోర్‌బోర్డు..

ఇండియా ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి)నబి (బి)ఫరీద్‌ అహ్మద్‌ 4, రోహిత్‌ శర్మ (నాటౌట్‌) 121, కోహ్లి (సి)ఇబ్రహీం (బి)ఫరీద్‌ 0, దూబే (సి)గుర్బాజ్‌ (బి)అజ్మతుల్లా 1, సంజు శాంసన్‌ (సి)నబి (బి)ఫరీద్‌ అహ్మద్‌ 0, రింకు సింగ్‌ (నాటౌట్‌) 69, అదనం 17. (20ఓవర్లలో 4వికెట్ల నష్టానికి) 212పరుగులు.

వికెట్ల పతనం: 1/18, 2/18, 3/21, 4/22

బౌలింగ్‌: ఫరీద్‌ అహ్మద్‌ 4-0-20-3, అజ్మతుల్లా 4-0-33-1, ఖ్విస్‌ అహ్మద్‌ 4-0-28-0, సలీమ్‌ 3-0-43-0, షరాఫుద్దీన్‌ 2-0-25-0, కరీమ్‌ జనత్‌ 3-0-54-0

ఆఫ్ఘనిస్తాన్‌ ఇన్నింగ్స్‌: గుర్బాజ్‌ (సి)సుందర్‌ (బి)కుల్దీప్‌ 50, జడ్రాన్‌ (స్టంప్‌)సంజు (బి)సుందర్‌ 50, గుల్బద్దిన్‌ (నాటౌట్‌) 55, జజారు (సి)బిష్ణోరు (బి)సుందర్‌ 0, నబి (సి)ఆవేశ్‌ ఖాన్‌ (బి)సుందర్‌ 34, కరీమ్‌ (రనౌట్‌)సంజు 2, నజీబుల్లా జడ్రాన్‌ (సి)కోహ్లి (బి)ఆవేశ్‌ ఖాన్‌ 5, అష్రాఫ్‌ (నాటౌట్‌) 5, అదనం 11. (20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి) 212 పరుగులు.

వికెట్ల పతనం: 1/93, 2/107, 3/107, 4/163, 5/167, 6/182

బౌలింగ్‌: ముఖేష్‌ కుమార్‌ 4-0-44-0, ఆవేశ్‌ ఖాన్‌ 4-0-55-1, రవి బిష్ణోరు 4-0-38-0, సుందర్‌ 3-0-18-3, దూబే 2-0-25-0, కుల్దీప్‌ 3-0-31-1.

 

➡️