న్యూజిలాండ్‌ 162ఆలౌట్‌- ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్‌

Mar 8,2024 22:25 #Sports

క్రైస్ట్‌చర్చ్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండోటెస్ట్‌లో న్యూజిలాండ్‌ బ్యాటర్లు తడబడ్డారు. దీంతో టాస్‌ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 162పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్‌ లాథమ్‌(38), కెప్టెన్‌ సోథీ(26), హెన్రీ(29) టాప్‌ స్కోరర్స్‌. మాజీ కెప్టెన్‌ విలియమ్సన్‌(17), రవీంద్ర(4), మిఛెల్‌(4) నిరాశపరిచారు. ఆస్ట్రేలియా బౌలర్లు హేజిల్‌వుడ్‌కు ఐదు, స్టార్క్‌కు మూడు, కమిన్స్‌, గ్రీన్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి 4వికెట్ల నష్టానికి 124పరుగులు చేసింది. ఓపెనర్లు స్మిత్‌(11), ఖవాజా(16) నిరాశపరిచినా.. లబూషేన్‌(45నాటౌట్‌), గ్రీన్‌(25), హెడ్‌(21) బ్యాటింగ్‌లో రాణించారు. న్యూజిలాండ్‌ బౌలర్‌ హెన్రీకి మూడు వికెట్లు దక్కాయి. రెండు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు 1ా0 ఆధిక్యతలో ఉంది.

➡️