పట్న గెలుపు- ప్రొ కబడ్డీ సీజన్‌-10

Dec 29,2023 22:23 #Sports

నోయిడా: ప్రొ కబడ్డీ సీజన్‌-10లో పట్న పైరెట్స్‌ మరో విజయాన్ని నమోదు చేసుకుంది. నోయిడా ఇండోర్‌ స్టేడియంలో శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో పట్న పైరెట్స్‌ 46-33పాయింట్ల తేడాతో హర్యానా స్టీలర్స్‌ను చిత్తుచేసింది. తొలి ఐదు నిమిషాల్లో 2-8పాయింట్ల ఆధిక్యతలో నిలిచిన హర్యానా ఆ తర్వాత వరుసగా పాయింట్లను చేజిక్కించుకుంది. తొలుత చివరి రైడ్‌కు పట్న ఆటగాడు రెండు పాయింట్లు సాధించి ఆలౌట్‌అయ్యే ప్రమాదం నుంచి బయటపడేశారు. ఆ తర్వాత పట్న వరుసగా పాయింట్లను సాధిస్తూ 15-10పాయింట్ల ఆధిక్యతలోకి దూసుకెళ్లింది. పట్న జట్టులో మంజిత్‌(13), సచిన్‌(8)రైడ్‌ పాయింట్లు సాధించగా.. హర్యానా జట్టులో వినరు(12) రైడ్‌ పాయింట్లు సాధించగా.. ట్యాకిల్స్‌లో ఆ జట్టు ఆశించినస్థాయిలో రాణించలేకపోయింది. ఈ గెలుపుతో పట్న 4వ స్థానానికి ఎగబాకింది.

 

➡️