పారిస్‌ ఒలింపిక్స్‌ తర్వాతఅథ్లెటిక్స్‌కు ఫ్రేజర్‌ ప్రైస్‌ గుడ్‌బై

Feb 9,2024 22:10 #Sports

జమైకా: మూడుసార్లు ఒలింపిక్‌ ఛాంపియన్‌ షెల్లీ-అన్‌ ఫ్రేసర్‌ ప్రైజ్‌ అథ్లెటిక్స్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు ప్రకటించింది. 2024 పారిస్‌ ఒలింపిక్స్‌ తన కెరీర్‌లో ఆఖరి అథ్లెటిక్స్‌ పోటీలు అని ప్రైస్‌ శుక్రవారం ట్విటర్‌ వేదికగా తెలిపింది. మహిళల 100మీ. స్ప్రింట్‌లో ఫ్రేసర్‌ వరుసగా నాలుగు ఒలింపిక్స్‌లో పతకాలతో సత్తా చాటింది. బీజింగ్‌ వేదికగా జరిగిన 2008 ఒలింపిక్స్‌లో తొలిసారి 100మీ. స్ప్రింట్‌లో స్వర్ణ పతకం సాధించిన ప్రైస్‌.. 2016(రియో)లో రజతం, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించింది. ఓ బిడ్డకు తల్లి అయిన 37ఏళ్ల ప్రైస్‌.. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్వీట్‌లో పేర్కొంది. ఒలింపిక్స్‌లో జమైకా తరఫున వరుసగా నాలుగు ఒలింపిక్స్‌లో పతకం సాధించిన ఏకైక స్ప్రింటర్‌ ప్రైస్‌ మాత్రమే.

➡️