ముంబయి జట్టులో శ్రేయస్‌కు చోటు

Feb 27,2024 22:30 #Sports

ముంబయి: భారత క్రికెట్‌ కంట్రోల్‌బోర్డు(బిసిసిఐ) ఆటగాళ్లపై కొరడా ఝుళిపిస్తోంది. శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌లపై గుర్రుగా ఉన్న బిసిసిఐ వీరిద్దరి కాంట్రాక్టులను పునరుద్ధరించేందుకు తాత్సారం చేసింది. దీంతో వెనక్కి తగ్గిన శ్రేయస్‌ రంజీట్రోఫీ సెమీస్‌లో ముంబయి తరఫున ఆడేందుకు మొగ్గుచూపాడు. క్వార్టర్‌ఫైనల్లో ముంబయి జట్టు విదర్భపై తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యతతో సెమీస్‌కు చేరడంతో సెమీస్‌లో ముంబయి తరఫున ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు శ్రేయస్‌ తెలిపాడు. ముంబయి సెలెక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ రాజు కులకర్ణి ఈ విషయాన్ని వెల్లడించాడు. దీంతో సెమీస్‌కు ప్రకటించిన జట్టులో శ్రేయస్‌ అయ్యర్‌కు జట్టులో చోటు దక్కింది. సూర్యాన్షు షిండే స్థానంలో శ్రేయస్‌ జట్టులో చోటు దక్కించుకున్నాడు. శనివారం నుంచి తమిళనాడుతో శరద్‌ పవార్‌ క్రికెట్‌ అకాడమీలో ముంబయి జట్టు రంజీట్రోఫీ సెమీఫైనల్‌ మ్యాచ్‌ ఆడనుంది.

ముంబయి జట్టు: రహానే(కెప్టెన్‌), పృథ్వీ షా, భూపిన్‌ లాల్వానీ, ముషీర్‌ ఖాన్‌, శ్రేయస్‌, హార్దిక్‌ థోమర్‌(వికెట్‌ కీపర్‌), శామ్స్‌ ములాని, తనుష్‌ కోటియన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, తుషార్‌ దేశ్‌పాండే, మోహిత్‌ అవస్థి, అమోఫ్‌ భట్కర్‌, ప్రసాద్‌ పవార్‌, ఆదిత్య ధుమాల్‌, రోస్టన్‌ డియాస్‌, ధవల్‌ కులకర్ణి.

➡️