- అరంగేట్రం టెస్ట్‌లోనే మూడు వికెట్లు పడగొట్టిన యువ బౌలర్
- రూట్ సెంచరీ
- ఇంగ్లండ్ 302/7
రాంచీ : ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాల్గో టెస్ట్‌లో బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. జస్ప్రీత్ బుమ్రా స్థానంలో చోటు దక్కించుకున్న ఆకాశ్ దీప్.. అంచనాలకు తగ్గట్టుగానే రాణించాడు. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ టాపార్డర్‌ను కకావికలం చేసి తన అరంగేట్రాన్ని ఘనంగా చాటుకున్నాడు. బుల్లెట్ లాంటి బంతులతో తొలి మూడు వికెట్లు తీసి ఔరా అనిపించాడు. ఓపెనర్ క్రాలే వికెట్‌ను పడగొట్టి కెరీర్ తొలి వికెట్‌ను సాధించాడు. ఈ క్రమంలో సెలెక్టర్ల నమ్మకాన్ని వమ్ముచేయక డకెట్, పోప్ వికెట్లను పడగొట్టి టాపార్టర్‌ను కట్టడి చేశాడు. నాల్గోటెస్ట్లో టాస్ గెలిచి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ను యువ బౌలర్ ఆకాశ్ దీప్ కట్టడి చేశాడు. సిరాజ్‌కి తోడు స్పిన్నర్లు కూడా చెలరేగడంతో ఇంగ్లండ్ జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్(106) సెంచరీ సాధించి అజేయంగా నిలవడం తొలిరోజు ఆటలో విశేషాలు. రూట్‌కు ఇది కెరీర్లో ఇది 31వ టెస్టు సెంచరీ. టీమిండియా కొత్త పేసర్ ఆకాశ్ దీప్ ధాటికి ఇంగ్లండ్ ఓ దశలో 112 పరుగులకే 5 వికెట్లు కోల్పో కష్టాల్లో పడింది. ఆ దశలో జట్టును రూట్-ఫోక్స్ ఆదుకున్నాడు. వికెట్ కీపర్ బెన్ ఫోక్స్‌తో కలిసి వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశాడు. బెన్ ఫోక్స్ 126 బంతుల్లో 47 పరుగులు చేశాడు. వీఇరద్దరూ కలిసి 6వ వికెట్‌కు 113పరుగులు జతచేసి ఇంగ్లండ్‌ను ఆదుకున్నారు. ఈ జోడీని సిరాజ్ విడదీశాడు. బెన్ ఫోక్స్‌ను అవుట్ చేసిన సిరాజ్… ఆ తర్వాత టామ్ హార్ట్‌లీను పెవిలియన్ చేర్చాడు. దాంతో ఇంగ్లండ్ 245 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. ఈ క్రమం లోనే సెంచరీ పూర్తి చేసుకున్న రూట్… ఓల్లీ రాబిన్సన్తో కలిసి మరో వికెట్ పడకుండా విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి రూట్ 106 పరుగులు, రాబిన్సన్ 31 పరుగులు క్రీజులో ఉన్నారు. రూట్ మొత్తం 223 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు కొట్టాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు జాక్ క్రాలే 42, బెన్ డకెట్ 11 పరుగులు చేశారు. ఓల్లీ పోప్ (0) డకౌట్ కాగా, జానీ బెయిర్ స్టో 38 పరుగులతో ఓ మోస్తరుగా రాణించాడు. కెప్టెన్ బెన్ స్టోక్స్ (3) నిరాశపరిచాడు. టీమిండియా బౌలర్లలో ఆకాశ్ దీప్‌కు మూడు, సిరాజ్‌కు రెండు, జడేజా, అశ్విన్‌కు ఒక్కో వికెట్ దక్కాయి.
స్కోర్‌బోర్డు…
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలే (బి)ఆకాశ్ దీప్ 42, డకెట్ (సి)ధృవ్ జురెల్ (బి)ఆకాశ్ దీప్ 11, పోప్ (ఎల్బి)ఆకాశ్ దీప్ 0, రూట్ (బ్యాటింగ్) 106, బెయిర్‌స్టో (ఎల్బి)అశ్విన్ 38, బెన్ స్టోక్స్ (ఎల్బి)జడేజా 3, ఫోక్స్ (సి)జడేజా (బి)సిరాజ్ 47, హార్ట్లీ (బి)సిరాజ్ 13, రాబిన్సన్ (బ్యాటింగ్) 31, అదనం 11. (90ఓవర్లలో 7వికెట్ల నష్టానికి) 302పరుగులు. వికెట్ల పతనం: 1/47, 2/47, 3/57, 4/109, 5/112, 6/225, 7/245 బౌలింగ్: సిరాజ్ 13-3-60-2, ఆకాశ్ దీప్ 17-0-70-3, జడేజా 27-7-56-1, అశ్విన్ 22-1-83-1, కుల్దీప్ 10-3-21-0, జైస్వాల్ 1-0-6-0