French Open : చాంపియన్‌గా అల్కరాజ్‌

Jun 10,2024 00:51 #French Open, #Sports, #Tennis

స్పెయిన్‌ సంచలనం అల్కరాజ్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ కైవసం చేసుకున్నాడు. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌లో అల్కరాజ్‌ 6-3, 2-6, 5-7, 6-1, 6-2 తేడాతో 4వ సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ను ఓడించాడు. 4 గంటల 19 నిమిషాలపాటు ఇద్దరి మధ్య పోరు హౌరాహౌరీగా సాగింది. ఐదు సెట్లలో జరిగిన మ్యాచ్‌లో అల్కరాజ్‌ విజయం సాధించాడు. ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌ నెగ్గిన అల్కరాజ్‌కు జ్వెరెవ్‌ వరుస షాక్‌లు ఇచ్చాడు. వరుసగా రెండు, మూడు సెట్లు నెగ్గాడు. ఈ క్రమంలో పుంజుకున్న అల్కరాజ్‌ నాలుగు, ఐదు సెట్లలో జ్వెరెవ్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచాడు. కాగా అల్కరాజ్‌కు ఇది మూడో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌. 2022లో యూఎస్‌ ఓపెన్‌, గతేడాది వింబుల్డన్‌ టైటిల్స్‌ సాధించాడు.

➡️