- చిరాగ్, సాత్విక్‌లకు ఖేల్‌రత్న అవార్డులు
- హుసాముద్దీన్, షమీకి అర్జునా జాతీయ క్రీడా అవార్డుల ప్రకటన
న్యూఢిల్లీ: 2023 ఏడాదికి జాతీయ క్రీడా అవార్డులను కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. దేశంలో అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డును భారత బ్యాడ్మింటన్ ద్వయం చిరాగ్ చంద్రశేఖర్ శెట్టి-రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్‌లకు ప్రకటించారు. సాత్విక్ సాయిరాజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమలాపురంకు చెందిన వాడు. ఇక తెలంగాణలోని నిజామాబాద్‌కు చెందిన బాక్సర్ మహ్మద్ హుసాముద్దీన్, క్రికెటర్ మహ్మద్ షమీతో కలిపి మొత్తం 26మంది అర్జున అవార్డుకు ఎంపికయ్యారు. జనవరి 9, 2024న రాష్ట్రపతి భవన్లో వీరంతా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా అవార్డులను అందుకోనున్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2023/12/Satwik-Chirag-1-1024x614.jpg)
చిరాగ్ చంద్రశేఖర్ షెట్టి (బ్యాడ్మింటన్)
రాంకిరెడ్డి సాత్విక్‌సాయిరాజ్ (బ్యాడ్మింటన్)
- అర్జున అవార్డు పూర్తి జాబితా
- ఓజాస్ ప్రవీణ్ డియోటాలే (ఆర్చరీ)
- అదితి గోపీచంద్ స్వామి (ఆర్చరీ)
- శ్రీశంకర్ ఎం (అథ్లెటిక్స్)
- పరుల్ చౌదరి (అథ్లెటిక్స్)
- మొహమీద్ హుసాముద్దీన్ (బాక్సింగ్)
- ఆర్ వైశాలి (చెస్)
- మహమ్మద్ షమీ (క్రికెట్)
- అనుష్ అగర్వాలా (ఈక్వెస్ట్రియన్)
- దివ్యకృతి సింగ్ (ఈక్వెస్ట్రియన్ డ్రస్సేజ్)
- దీక్షా దాగర్ (గోల్ఫ్)
- క్రిషన్ బహదూర్ పాఠక్ (హాకీ)
- పుఖ్రంబం సుశీల చాను (హాకీ)
- పవన్ కుమార్ (కబడ్డీ)
- రీతూ నేగి (కబడ్డీ)
- నస్రీన్ (ఖో-ఖో)
- పింకీ (లాన్ బౌల్స్)
- ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ (షూటింగ్)
- ఈషా సింగ్ (షూటింగ్)
- హరీందర్ పాల్ సింగ్ సంధు (స్క్వాష్)
- అహికా ముఖర్జీ (టేబుల్ టెన్నిస్)
- సునీల్ కుమార్ (రెజ్లింగ్)
- ఆంటిమ్ (రెజ్లింగ్)
- నౌరెమ్ రోషిబినా దేవి (వుషు)
- శీతల్ దేవి (పారా ఆర్చరీ)
- ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి (అంధుల క్రికెట్)
- ప్రాచీ యాదవ్ (పారా కెనోయింగ్)
ద్రోణాచార్య అవార్డులు 2023 (రెగ్యులర్):
- లలిత్ కుమార్ (రెజ్లింగ్)
- ఆర్ బి రమేష్ (చదరంగం)
- మహావీర్ ప్రసాద్ సైనీ (పారా అథ్లెటిక్స్)
- శివేంద్ర సింగ్ (హాకీ)
- గణేష్ ప్రభాకర్ దేవ్రుఖ్కర్ (మల్లఖాంబ్)
ద్రోణాచార్య అవార్డులు 2023 (లైఫ్‌టైమ్):
- జస్కీరత్ సింగ్ గ్రేవాల్ (గోల్ఫ్)
- ఈ భాస్కరన్ (కబడ్డీ)
- జయంత కుమార్ పుషీలాల్ (టేబుల్ టెన్నిస్)
ధ్యాన్‌చంద్ అవార్డులు 2023 (లైఫ్‌టైమ్):
- మంజుషా కన్వర్ (బ్యాడ్మింటన్)
- వినీత్ కుమార్ శర్మ (హాకీ)
- కవిత సెల్వరాజ్ (కబడ్డీ)
మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ 2023:
- గురునానక్ దేవ్ యూనివర్సిటీ, అమృత్సర్ (విజేత)
- లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, పంజాబ్ (మొదటి రన్నరప్)
- కురుక్షేత్ర విశ్వవిద్యాలయం, కురుక్షేత్ర (రెండో రన్నరప్)