బిసిసిఐ అవార్డుల ప్రధానోత్సవం

Jan 24,2024 13:23 #Sports
  • సందడి చేసిన టీమిండియా ఆటగాళ్లు

హైదరాబాద్‌: భారత క్రికెట్‌ కంట్రోల్‌బోర్డు(బిసిసిఐ) వార్షిక అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లో కన్నుల పండువగా సాగింది. ఈ కార్యక్రమంలో టీమిండియా ఆటగాళ్లు సందడి చేశారు. నాలుగేళ్ల తర్వాత జరుగుతున్న ఈ కార్యక్రమానికి టీమిండియా ఆటగాళ్లతో పలువురు భారత మాజీ క్రికెటర్లూ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భారత పురుష క్రికెటర్లతో పాటు మహిళా క్రికెటర్లు, యువ క్రికెటర్లు కూడా పాల్గన్నారు. గత నాలుగేళ్ల కాలంలో వివిధ విభాగాల్లో సత్తా చాటిన వారికి బిసిసిఐ ఈ సందర్భంగా అవార్డులను అందజేశారు. అలాగే పలువురు మాజీ క్రికెటర్లకు కూడా ప్రతిష్టాత్మక అవార్డులు దక్కాయి.

అవార్డులు అందుకున్న వారి వివరాలు..

రవిశాస్త్రి: కల్నల్‌ సీకే నాయుడు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు

ఫారూక్‌ ఇంజనీర్‌: కల్నల్‌ సీకే నాయుడు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు (2019-20)

శుభ్‌మన్‌ గిల్‌: పాలీ ఉమ్రిగర్‌ ఉత్తమ అంతర్జాతీయ ఆటగాడు (2022-23)

జస్ప్రీత్‌ బుమ్రా: పాలీ ఉమ్రిగర్‌ ఉత్తమ అంతర్జాతీయ ఆటగాడు (2021-22)

రవిచంద్రన్‌ అశ్విన్‌: పాలీ ఉమ్రిగర్‌ ఉత్తమ అంతర్జాతీయ ఆటగాడు (2020-21)

మొహమ్మద్‌ షమీ: పాలీ ఉమ్రిగర్‌ ఉత్తమ అంతర్జాతీయ ఆటగాడు (2019-20)

స్మృతి మంధన: ఉత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్‌ (2020-21, 2021-22)

దీప్తి శర్మ: ఉత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్‌ (2019-20, 2022-23)

అంతర్జాతీయ క్రికెట్‌లో ఉత్తమ అరంగేట్రం (పురుషులు)..

2019-20: మయాంక్‌ అగర్వాల్‌

2020-21: అక్షర్‌ పటేల్‌

2021-22: శ్రేయస్‌ అయ్యర్‌

2022-23: యశస్వి జైస్వాల్‌

అంతర్జాతీయ క్రికెట్‌లో ఉత్తమ అరంగేట్రం అవార్డులు..

ప్రియా పూనియా: 2019-20

షఫాలీ వర్మ: 2020-21 సబ్బినేని

మేఘన: 2021-22

అమన్‌జోత్‌ కౌర్‌: 2022-23

దిలీప్‌ సర్దేశారు అవార్డులు..

అశ్విన్‌ (2022-23 భారత్‌ వర్సెస్‌ వెస్టిండీస్‌ సిరీస్‌లో అత్యధిక వికెట్లు)

యశస్వి జైస్వాల్‌ (2022-23 భారత్‌ వర్సెస్‌ వెస్టిండీస్‌ సిరీస్‌లో అత్యధిక పరుగులు)

వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన మహిళా క్రికెటర్లు..

పూనమ్‌ యాదవ్‌: 2019-20

ఝులన్‌ గోస్వామి: 2020-21

రాజేశ్వరి గైక్వాడ్‌: 2021-22

దేవిక వైద్య: 2022-23

వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్లు..

పూనమ్‌ రౌత్‌: 2019-20

మిథాలీ రాజ్‌: 2020-21

హర్మన్‌ప్రీత్‌ కౌర్‌: 2021-22

జెమీమా రోడ్రిగెజ్‌: 2022-23

దేశవాలీ క్రికెట్‌లో ఉత్తమ అంపైర్లు..

అనంత పద్మనాభన్‌: 2019-20

వ్రిందా రతి: 2020-21

జయరామన్‌ మదన్‌ గోపాల్‌: 2021-22

రోహన్‌ పండిట్‌: 2022-23

దేశవాలీ క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన జట్లు..

ముంబై: 2019-20

మధ్యప్రదేశ్‌: 2021-22

సౌరాష్ట్ర: 2022-23

లాలా అమర్‌నాథ్‌ అవార్డు (ఆల్‌రౌండర్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌)..

బాబా అపరాజిత్‌: 2019-20

రిషి ధవన్‌: 2020-21, 2021-22

రియాన్‌ పరాగ్‌: 2022-23

లాలా అమర్‌నాథ్‌ అవార్డు (ఆల్‌రౌండర్‌ రంజీ ట్రోఫీ)..

ముర సింగ్‌: 2019-20

షమ్స్‌ ములానీ: 2021-22

సరాన్ష్‌ జైన్‌: 2022-23

మాధవరావ్‌ సింధియా అవార్డులు (రంజీల్లో అత్యధిక వికెట్లు)..

జయదేవ్‌ ఉనద్కత్‌: 2019-20

షమ్స్‌ ములానీ: 2021-22

జలజ్‌ సక్సేనా: 2022-23

మాధవరావ్‌ సింధియా అవార్డులు (రంజీల్లో అత్యధిక పరుగులు)..

రాహుల్‌ దలాల్‌: 2019-20

సర్ఫరాజ్‌ ఖాన్‌: 2021-22

మయాంక్‌ అగర్వాల్‌: 2022-23

➡️