సెమీస్‌ ఫైనల్‌కు చెన్నై జట్లు

Jan 15,2024 00:36

ప్రజాశక్తి – మెదరమెట్ల
రావినూతల ఆర్ఎస్‌సిఏ ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ భ్రమర 30వ సంక్రాంతి క్రికెట్ కప్ 2024 ఈనెల 9నుండి పోటీలు జరుగుతున్న విషయం పాఠకులకు తెలిసిందే. ఈ పోటీల్లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో శ్రీసీసీ చెన్నై, జిఎస్టి సెంట్రల్ ఎక్సైజ్ చెన్నై జట్లు సెమీస్‌కు అర్హత సాధించాయి. ఆదివారం ఉదయం జరిగిన మ్యాచ్‌లో థండర్ బోల్ట్ తిరుపతి, శ్రీసీసీ చెన్నై జట్లు తలపడగా చెన్నై జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొంది. మొదట బ్యాటింగ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 123 పరుగులను మాత్రమే చేయగలిగింది. జట్టులో ముఖేష్ 42బంతుల్లో 34 పరుగులు చేసి పరవాలేదు అనిపించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన తిరుపతి జట్టు 11.3 ఓవర్లలో కేవలం 44పురుగులను మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. నలుగురు బ్యాట్స్‌ మెన్స్ డక్ అవుట్ అవ్వటం గమనార్హం. ఏ స్థితిలోనూ చెన్నై జట్టుకు తిరుపతి జట్టు ఎదురు నిలవలేకపోయింది. చెన్నై జట్టులో తరుణ్ 2.3 ఓవర్లలో 7 పరుగులను మాత్రమే ఇచ్చి 4వికెట్లను తీసుకొని తిరుపతి జట్టు పతనాన్ని శాసించాడు. దాంతో చెన్నై జట్టు సమీస్‌కు అర్హత సాధించింది. మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో ప్రసాద్ స్పోర్ట్స్ లెవెన్ హైదరాబాద్, జిఎస్టి సెంట్రల్ ఎక్సైజ్ చెన్నై జట్లు తెలపడగా చెన్నై జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట నిర్ణీత 20ఓవర్లలో హైదరాబాద్ జట్టు 7 వికెట్లను కోల్పోయి 141 పరుగులను మాత్రమే చేసింది. జట్టులో అభి 5ఫోర్లు, రెండు సిక్సులతో 39 బంతుల్లో 56పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన చెన్నై జట్టు 16.2 ఓవర్లలో నాలుగు వికెట్లను మాత్రమే కోల్పోయి 142పరుగులు చేసి, ఆరు వికెట్ల విజయాన్ని అందుకుంది. జట్టులో కెవిన్ 37బంతుల్లో 44 పరుగులు, సుదన్ 26 బంతుల్లో 32 పరుగులు చేసి జట్టు విజయాన్ని శాసించారు. దీంతో చెన్నైకి చెందిన రెండు జట్లు నేడు జరగబోయే సెమీఫైనల్స్ కు అర్హత సాధించాయి. నేటి మ్యాచ్ల మ్యాచ్‌ల వివరాలు. ఈరోజు సెమీఫైనల్స్ జరుగుతుండగా ఉదయం 9:30 గంటలకు చికోలు చీట్స్ వైజాగ్ వర్సెస్ శ్రీసీసీ చెన్నై జట్లు, మధ్యాహ్నం జీఎస్టీ సెంట్రల్ ఎక్సైజ్ చెన్నై వర్సెస్ సౌత్ జోన్ సిసి చెన్నై జట్లు తలపడనున్నాయి. సంక్రాంతి సందర్భంగా రావినూతల ఆర్ఎస్‌ సిఏ స్టేడియంలో క్రికెట్ అభిమానులకు పండుగతో పాటు క్రికెట్ పండుగను సెమీఫైనల్స్ ద్వారా జట్లు అందించనున్నాయని ఆర్ఎస్‌సిఏ అధ్యక్షుడు కారుసాల నాగేశ్వరరావు తెలిపారు.

➡️