ఫైనల్‌కు చిరాగ్‌-సాత్విక్‌ జంట

Jan 20,2024 23:12 #Sports

సెమీస్‌లో ఓడిన ప్రణయ్

ఫైనల్‌కు షీాయు, లీ చౌక్‌ఇండియా ఓపెన్‌ సూపర్‌750

న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ సింగిల్స్‌లో భారత్‌ పోరాటం ముగియగా.. పురుషుల డబుల్స్‌లో చిరాగ్‌శెట్టి-సాత్విక్‌ సాయిరాజ్‌ రంకిరెడ్డి జంట ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్‌లో చిరాగ్‌-సాత్విక్‌ జంట 21-18, 21-14తో మలేషియాకు చెందిన షో-వుయ్-ఆరోన్‌(మలేషియా)ను చిత్తుచేశారు. రెండోగేమ్‌లో ఓ దశలో 12-13తో వెనుకబడ్డా.. ఆ తర్వాత వరుసగా పాయింట్లు సాధించి విజయం సాధించారు. ఆదివారం జరిగే ఫైనల్లో టైటిల్‌కై కొరియా జంటతో పోటీపడనున్నారు. ఇక పురుషుల సింగిల్స్‌ రెండో సెమీస్‌లో 8వ సీడ్‌ ప్రణయ్ 15-21, 5-21తో 6వ సీడ్‌ షీాయు(చైనా) చేతిలో వరుససెట్లలో ఓడాడు. తొలిసెట్‌లో హోరాహోరీగా తలపడిన ప్రణయ్ ఓ దశలో 14-15పాయింట్లతో షీాయుకు చేరువయ్యాడు. ఆ తర్వాత చైనా షట్లర్‌ వరుసగా పాయింట్లు చేజిక్కించుకొని ఆ గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక రెండో సెట్‌లో ప్రణయ్ కు అవకాశమివ్వకుండా చైనా షట్లర్‌ మ్యాచ్‌ను ముగించాడు. తొలి సెమీస్‌లో 2వ సీడ్‌ కొడాయ్ నరోకా అనూహ్యంగా ఓటమిపాలయ్యాడు. సెమీస్‌లో నరోకాపై లీాఛౌక్‌ యు 21-13, 15-21, 21-19తో కొడాయ్ నరోకాను చిత్తుచేశాడు. ఇక మహిళల సింగిల్స్‌ ఫైనల్లోకి తైజుాయింగ్‌(చైనీస్‌ తైపీ), చెన్‌-యుఫీ(చైనా) ప్రవేశించారు. 4వ సీడ్‌ తైజు 21-13, 21-18తో యో-జియా-మిన్‌(సింగపూర్‌)ను చిత్తుచేయగా.. 2వ సీడ్‌ చెన్‌-యుఫీ 21-13, 21-18తో సహచర క్రీడాకారిణి వాంగ్‌-జి-యును ఓడించి ఫైనల్‌కు చేరింది.

➡️