ఈస్ట్‌జోన్‌కే టైటిల్‌

Apr 12,2024 22:50 #Sports

మహిళల ఇంటర్‌ జోనల్‌ మల్టీ-డే ట్రోఫీ
ముంబయి: మహిళల ఇంటర్‌ జోనల్‌ మల్టీ-డే టైటిల్‌ను ఈస్ట్‌జోన్‌ జట్టు చేజిక్కించుకుంది. సౌత్‌జోన్‌ మహిళల జట్టు నిర్దేశిం 184పరుగుల లక్ష్యాన్ని ఈస్ట్‌జోన్‌ జట్టు 61.3ఓవర్లలో 9వికెట్లు కోల్పోయి ఛేదించింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఈస్ట్‌జోన్‌ జట్టు బ్యాటర్‌ దీప్తి శర్మ(46), రీచా ఘోష్‌(33) రాణించగా.. సౌత్‌జోన్‌ బౌలర్‌ సహానా పవార్‌, మిన్ను మణి మూడేసి వికెట్లతో రాణించారు. ఈస్ట్‌జోన్‌ కెప్టెన్‌ దీప్తి శర్మకు టైటిల్‌ను టీమిండియా మహిళలజట్టు మాజీ కెప్టెన్‌ శుభాంగి కులకర్ణి అందజేశారు. అలాగే రూ.50లక్షల ప్రైజ్‌మనీ దక్కింది. రన్నరప్‌గా నిలిచిన సౌత్‌జోన్‌కు రూ.20లక్షల ప్రైజ్‌మనీ దక్కింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ మిన్న మణికి, ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌ దీప్తి శర్మకు లభించాయి.
సౌత్‌జోన్‌ : 133, 179
ఈస్ట్‌జోన్‌ : 129, 184/9

➡️