టి20ల్లో ఫెర్గుసన్‌ నయా చరిత్ర

Jun 18,2024 07:39 #Newzland, #sport, #T20 world cup

న్యూజిలాండ్‌ పేసర్‌ లూకీ ఫెర్గుసన్‌ టి20 క్రికెట్‌లో నయా చరిత్ర లిఖించాడు. ట్రినిడాడ్‌ వేదికగా పపువాన్యుగేనియాతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఫెర్గుసన్‌ ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మూడు వికెట్లు తీశాడు. దీంతో ఈ ఫార్మాట్‌లో 24 బంతులను ‘డాట్‌ బాల్స్‌’ (4-4-0-3)గా వేసిన తొలి బౌలర్‌గా రికార్డుపుటల్లోకెక్కాడు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ జట్టు 7వికెట్ల తేడాతో పపువాన్యుగేనియాపై ఘన విజయం సాధించింది.

➡️