పాక్‌పై భారత్‌ ఘన విజయం

Jun 10,2024 01:09 #Sports

టీ20 వరల్డ్‌ కప్‌లో భాగంగా ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయం సాధించింది. 119 పరుగులు లక్ష్యం అందుకోవడంలో పాక్‌ విఫలమైంది. లక్ష్యానికి 6 పరుగుల దూరంలో పాక్‌ నిలిచిపోయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 19 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌటైంది. రిషబ్ పంత్(42) కీలక ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ ఆ స్కోరైనా చేయగలిగింది. అనంతరం భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకున్నారు. ఛేదనకు దిగిన పాకిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 113/7 స్కోరుకే పరిమితమైంది.  పాక్‌ బ్యాటర్లలో మహ్మద్‌ రిజ్వాన్‌ (31),ఒక్కడే చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశాడు. బాబర్‌ అజామ్‌ (13), ఉస్మాన్‌ ఖాన్‌(13), ఫఖర్‌ జమాన్‌(13), షాదాబ్‌ ఖాన్‌(4), ఇఫ్తికర్‌ అహ్మద్‌(5), ఇమాద్‌ వాసిమ్‌(15), షాహీన్‌ అఫ్రిది(0), నసీమ్‌ షా(10) విఫలమాయ్యరు. భారత బౌలర్లలో బుమ్రా 3, హర్దిక్‌ 2, ఆర్షదీప్‌, అక్షర్‌ పటేల్‌ తలో వికెట్‌ తీసుకున్నారు.

➡️