విజయ్ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’

తమిళ హీరో దళపతి విజయ్ రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. తమిళగ వెట్రి కళగం పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని విజయ్ అధికారికంగా సోషల్‌ మీడియాలో ప్రకటించారు. ‘ప్రస్తుతం తమిళనాడులో అవినీతి పాలన కొనసాగుతోందని, దానిపై పోరాడేందుకే రాజకీయాల్లోకి వచ్చా. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మా పార్టీ పోటీచేయదు. ఇతర పార్టీలకు మద్దతు కూడా ఇవ్వబోం. 2026లో జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికల బరిలోకి దిగుతాం. త్వరలోనే పార్టీ జెండా, ఎజెండాను ప్రకటిస్తాం’ అంటూ వివరించారు.

➡️