భారత్‌ – ఇంగ్లాండ్‌ తొలి టెస్టు రెండో ఆట

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ వేదికగా జరుగుతున్న భారత్‌ – ఇంగ్లాండ్‌ తొలి టెస్టు రెండో రోజు ఆట శుక్రవారం ప్రారంభమైంది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ 246 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది.

  • కెఎల్‌ రాహుల్‌ (86) కొద్దిలో సెంచరీ మిస్‌ చేశారు. హార్ట్‌లీ బౌలింగ్‌లో (64.5వ ఓవర్‌) భారీ షాట్‌కు యత్నించి బౌండరీ వద్ద చిక్కిపోయారు. క్రీజులోకి వికెట్‌ కీపర్‌ భరత్‌ వచ్చారు. ప్రస్తుతం భారత స్కోరు 65 ఓవర్లకు 291/5
  • తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ పై భారత్‌ 4 పరుగు ఆధిక్యంలోకి వచ్చింది. ప్రస్తుతం భారత స్కోరు 57 ఓవర్లకు 250/4. క్రీజులో రాహుల్‌ (79) జడేజా (3) ఉన్నారు. రెహాన్‌ వేసిన ఈ ఓవర్లలో కెఎల్‌ రెండు భారీ సిక్స్‌లు బాదారు.
  • రెండో సెషన్‌ ప్రారంభమైన కాసేపటికే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. 223 పరుగుల వద్ద భారత్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. రెహాన్‌ బౌలింగ్‌లో (52.3వ ఓవర్‌) భారీ షాట్‌కు శ్రేయస్‌ అయ్యర్‌ యత్నించారు (35) బౌండరీ లైన్‌ వద్ద హార్ట్‌లీకి దొరికిపోయారు. ఆ తరువాత క్రీజులోకి రవీంద్ర జడేజా వచ్చారు. ప్రస్తుతం భారత స్కోరు – 53 ఓవర్లకు 223/4.

మొదటి టెస్టుపై భారత్‌ పట్టు బిగిస్తోంది. రెండోరోజు ఆట మొదలైన కొద్దిసేపటికే జైస్వాల్‌, గిల్‌ వికెట్లు కోల్పోయినా రాహుల్‌ అర్థ శతకంతో మెరిశారు. ప్రస్తుతం క్రీజులో రాహుల్‌ (55), శ్రేయస్‌ (34) ఉన్నారు. ఈ సెషన్‌ తొలి ఓవర్‌ను ఇంగ్లాండ్‌ బౌలర్‌ రెహాన్‌ వేశారు. ప్రస్తుత భారత స్కోరు 48 ఓవర్లకు 212/3 లో ఉంది.

➡️